Casteist Assault : కులం పేరుతో భార్యను హింసించిన భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

కులం పేరుతో మహిళను కించపరుస్తూ హింసించిన భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Casteist Assault : కులం పేరుతో భార్యను హింసించిన భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Gujarat Man Booked Under Sc St Act After Wife Complains Of Casteist Assault

Updated On : May 26, 2021 / 9:02 PM IST

Casteist Assault : కులం పేరుతో మహిళను కించపరుస్తూ హింసించిన భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గాంధీనగర్ లోని వివోల్ గ్రామానికి చెందిన విపూల్ సాధుపై సెక్టార్ 7 పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సోడా డ్రింకు షాకు యజమాని అయిన విపూల్.. అదే ప్రాంతానికి చెందిన త్రిపాఠి చౌహాన్ (32)తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. సాధు భార్య త్రిపాఠి దోమల మందు తాగింది. గాంధీనగర్ లోని సివిల్ ఆస్పత్రిలో చేరింది. తనను కులవివక్షతో హింసించడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో కులానికి చెందిన విపూల్ ను వివాహం చేసుకున్నట్టు ఆమె తెలిపింది. పెళ్లి అయిన కొన్ని ఏళ్ల తర్వాత కులాన్ని నిందిస్తూ వివక్షపూరిత కామెంట్లను చేస్తున్నాడంటూ ఫిర్యాదులో తెలిపింది.

2019లో తన భర్తపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. పెళ్లి బంధాన్ని వదులుకోలేక మళ్లీ తనతో రాజీపడి జీవితాన్ని కొనసాగించినట్టు తెలిపింది. లాక్ డౌన్ సమయంలో తన భర్త వ్యాపారాన్ని కోల్పోవడంతో తాను కూడా పనిచేయాలని నిర్ణయించుకుంది. అది నచ్చని సాధు ఆమెపై పలుమార్లు హింసించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సాధుపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.