School Principal Arrest : పాఠశాలలో 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు…కీచక ప్రిన్సిపాల్ అరెస్ట్

హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు....

School Principal Arrest

School Principal Arrest : హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులకు అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్ 14వతేదీన పోలీసులకు పంపామని, అయితే అక్టోబర్ 30వతేదీన మాత్రమే పోలీసులు చర్యలు తీసుకున్నారని కమిషన్ తెలిపింది.

Also Read : Girl students : పరీక్షలు రాసేందుకు వచ్చిన మహిళల మంగళ సూత్రాలు తొలగించారు…

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 50 మందికి పైగా బాలికలు అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే విద్యాశాఖ మాత్రం నిందితులను అక్టోబర్ 27వతేదీన సస్పెండ్ చేసింది తప్ప తదుపరి చర్యలు తీసుకోలేదు. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యంతో జింద్ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి అరెస్టు చేసినట్లు జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.

Also Read : Team Indias win : దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం… యూపీ వధూవరుల సంబరాలు

‘‘ప్రిన్సిపాల్‌పై 60 మంది నుంచి మాకు రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. ఇందులో 50 ఫిర్యాదులు నిందితుల చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాయని తెలిపిన బాలికల ఫిర్యాదులున్నాయి. మరో పది మంది బాలికలు తమ ఫిర్యాదులో ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్లు తమకు తెలుసని చెప్పారు. ఈ విషయాన్ని హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియాను చెప్పారు.

Also Read : Work from home : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్…50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం

నిందితుడైన ప్రిన్సిపాల్ తమను తన కార్యాలయానికి పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడేవారని బాధిత బాలికలు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌కు మద్దతిచ్చిన మహిళా ఉపాధ్యాయురాలి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు రేణు భాటియా తెలిపారు. ఈ ఘటనపై జింద్ జిల్లా పోలీసులు సోమవారం ప్రిన్సిపాల్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354-ఎ, 341, 342, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.