Chintapalli Murder : చింతపల్లి కేసు..మొండెం ఎక్కడ ?

ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో.. కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.. మహంకాళి ఆలయం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు...

Chintapalli Murder Mystery : సంచలనం రేపిన చింతపల్లి మొండెం కేసు చిక్కుముడి వీడటం లేదు.. మొండెంలేని తల దొరికిన ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆ మిస్టరీని మాత్రం పోలీసులు చేధించలేదు.. మృతుడు జైహింద్‌ నాయక్‌ మొండెం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో.. కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.. మహంకాళి ఆలయం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు.

Read More : Akkineni Nagarjuna: మా సమస్యల పరిష్కారం కోసం జగన్ దగ్గరకు చిరంజీవి -నాగార్జున

జైహింద్ ను కిడ్నాప్ చేశారా :-
జైహింద్‌కు మతిస్థిమితం లేకపోవడం.. సెల్‌ ఫోన్ ఉపయోగించకపోవడం.. చివరి సారిగా అతడిని చూసిన వారు ఎవరూ లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు.. మరోవైపు మృతుడు ఉంటున్న తుర్కయాంజల్‌పై పోలీసులు దృష్టి సారించారు. అక్కడి స్థానికులను రెండు రోజులుగా విచారించిన పోలీసులకు జైహింద్‌ వారం రోజులుగా కనిపించడం లేదని గుర్తించారు. ఎవరితోనో కారులో వెళ్లినట్టు వారు చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో హత్యకు వారం రోజుల ముందే జైహింద్‌ను కిడ్నాప్‌ చేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. జైహింద్‌ను కిడ్నాప్‌ చేసి ఎటువైపు తీసుకెళ్లారు? ఎక్కడ హత్య చేశారు? హత్య చేసిన అనంతరం మొండెం ఎక్కడ ఉంచారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు ఖాకీలు.

Read More : Errabelli Dayakar : కేసీఆర్- కేటీఆర్ పై చేయి వేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు : మంత్రి ఎర్రబెల్లి

గుప్త నిధుల కోసం తవ్వారా ? :-
ఇక జైహింద్‌ స్వస్థలంలో కూడా పోలీసులు ముమ్మురంగా దర్యాప్తు చేశారు. శూన్యపహడ్‌లో అతడికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? అన్న కోణంలో విచారణ జరిపారు.. అయితే ఆరేళ్లుగా అతను ఇంటికి వెళ్లింది కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే అని తేలడంతో.. హత్యకు గొడవలు కారణం కాదని నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది.. దీంతో కేసు అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ గుప్తు నిధుల వద్దకే వచ్చి ఆగింది.. ఆదివారం అర్థరాత్రి హత్య జరగడం.. కాళీ ఆలయం దగ్గర ఉంచడం.. పక్కనే పూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉండటంతో ఇది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన పనే అని బలంగా నమ్ముతున్నారు పోలీసులు.. గతంలో ఎవరైనా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారా? ఇలాంటి బలులు ఏమైనా ఇచ్చారా? అలాంటి కేసులు ఏమైనా పోలీస్‌ స్టేషన్‌లలో నమోదయ్యాయా? అన్న దానిపై దృష్టి సారించారు..

Read More : Shock to BJP: యూపీలో బీజేపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా!

జైహింద్ ను కిడ్నాప్ చేశారా :-
ఈ కేసులో మొండెం ఎక్కడుందో దొరికితేనే కేసులో ఎంతో కొంత పురోగతి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.. ఇబ్రహీంపట్నంతో పాటూ నల్గొండ జిల్లాలోని చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో ఉన్న గుట్టలను జల్లెడ పడుతున్నారు.. త్వరలోనే మొండెం మిస్టరీని చేధిస్తామంటున్నారు. జైహింద్‌కు ఇంకా పెళ్లి కూడా కాలేదన్నారు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేవన్నారు.

ట్రెండింగ్ వార్తలు