Shock to BJP: యూపీలో బీజేపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా!

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీ సమాజ్‌వాదీలో చేరిత తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి.

Shock to BJP: యూపీలో బీజేపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా!

Mla

Shock to BJP: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీ సమాజ్‌వాదీలో చేరిత తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి.

ఈ క్రమంలోనే బీజేపీకి ఎన్నికల ముందు మరో పెద్ద షాక్ తగిలింది. దళితులు, OBCలు, రైతులు, నిరుద్యోగులు, చిరువ్యాపారులపై అణచివేతకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మౌర్యకు సపోర్ట్‌‍గా మరో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.

స్వామి ప్రసాద్ మౌర్య పార్టీ విడిచిపోవడం వల్ల బీజేపీకి ఎన్ని సీట్ల నష్టం వాటిల్లుతుందో తెలియని పరిస్థితిలో.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ.. శిఖోహాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ముఖేష్ వర్మ.. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వెంట ఉంటామని స్పష్టత ఇచ్చారు. ఆయనే కాదు.. మరికొంత మంది పార్టీని విడిచి ఆయనతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ రాజీనామాతో అసంతృప్త ఆధికార పార్టీ నేతల రాజీనామాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార పార్టీ బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి మౌర్య కారణంగా వలసలు ఊపందుకున్నాయి. వారం వ్యవధిలోనే పార్టీని ఆరుగురు ఎమ్మెల్యేలు వీడగా.. ఇందులో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఉండడం విశేషం.

ఒకప్పుడు జనతాదళ్‌తో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన స్వామి ప్రసాద్ మౌర్య BSPలో చేరినప్పుడు, మాయావతికి యాదవేతర OBCల ముఖ్యమైన నాయకుడిగా చెప్పారు. 2007లో ఆమె గెలుపులో OBC తరగతి ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మౌర్య, మాయావతి మాత్రమే మీడియాతో మాట్లాడేవారు.

ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా కూడా మౌర్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే ఆయన పార్టీ వీడినట్లుగా తెలుస్తోంది. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎం అయిన మొదటి రోజు నుంచే, స్వామి ప్రసాద్ మౌర్యకు ప్రాధాన్యత తగ్గించినట్లుగా అనుచరులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనా, పార్టీ అధినాయకత్వంపైనా మౌర్య అసంతృప్తి స్వరం అప్పటి నుంచే వినిపిస్తున్నారు.