Husband Brutally Killed Wife : షాకింగ్ వీడియో.. భార్యను రైల్వే ట్రాక్ పై పడేసి చంపేసిన భర్త
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడు అయ్యాడు. భార్యను రైల్వే ట్రాక్ పై పడేసి చంపేశాడు.

Husband Brutally Killed Wife : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడు అయ్యాడు. భార్యను రైల్వే ట్రాక్ పై పడేసి చంపేశాడు. భార్య పిల్లలతో కలిసి భర్త అర్థరాత్రి వసై రోడ్ లోని రైల్వేస్టేషన్ కు వచ్చాడు. అక్కడే పిల్లలతో పాటు భార్యను పడుకోబెట్టాడు. ఇంతలో ట్రైన్ వస్తుండటాన్ని గమనించిన భర్త పడుకున్న భార్య నిద్రలేపి ఒక్కసారిగా ఆమెను రైల్వే ట్రాక్ పైకి తోసేసి చంపేశాడు. అనంతరం నిద్రపోతున్న పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ షాకింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ పై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఆ వ్యక్తిని థానే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. భార్యను చంపిన తర్వాత ఆ వ్యక్తి ట్రైన్ లో దాదర్ వెళ్లాడు. ఆ తర్వాత కళ్యాణ్ కు ట్రైన్ లో వెళ్లాడు. ఐసీపీ సెక్షన్ 302(మర్డర్) కింద పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
మంగళవారం తెల్లవారుజామున 4గంటల 10 నిమిషాల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పడుకున్న భార్యను లేపిన భర్త ఆమెను ఈడ్డుకుని వెళ్లి రైల్వే ట్రాక్ పైకి తోసేశాడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ దృశ్యాలు చూసిన వాళ్లంతా షాక్ కి గురవుతున్నారు.
ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్లాన్ ఫామ్ నెంబర్ 5పై నిద్రపోతోంది. కాసేపటికి అవాద్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తుండటాన్ని గమనించిన భర్త.. నిద్రపోతున్న భార్యను లేపాడు. ఆ తర్వాత ఆమెను ఈడ్చుకుని వెళ్లి ట్రాక్ పై పడేశాడు. ఆమె మీద నుంచి ట్రైన్ వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే చనిపోయింది అని రైల్వే పోలీసులు తెలిపారు. తల్లి చనిపోయింది, తండ్రి అరెస్ట్ అయ్యాడు…. దీంతో వారి ఇద్దరి పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు వారిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.