Husband killed wife : వివాహేతర సంబంధం…భార్య మెడకు చార్జర్ వైర్ బిగించి…

తాళి కట్టి జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసి భర్తను ప్రశ్నించింది. కోపంతో ఉన్నభర్త, భార్య మెడకు సెల్ ఫోన్ చార్జర్   వైరు బిగించి హత్య చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Husband killed wife : వివాహేతర సంబంధం…భార్య మెడకు చార్జర్ వైర్ బిగించి…

Husband Killed Wife Karnataka

Updated On : August 1, 2021 / 12:00 PM IST

Husband killed wife : తాళి కట్టి జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసి భర్తను ప్రశ్నించింది. కోపంతో ఉన్నభర్త, భార్య మెడకు సెల్ ఫోన్ చార్జర్   వైరు బిగించి హత్య చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని  యలబుర్గి తాలూకా యడ్డోణి   గ్రామానికి చెందిన మంజులకు కొప్పళ   తాలూకా ముద్దాబళ్లికి  చెందిన మంజునాథ్‌  కట్టమనితో  పెళ్లయ్యింది. మంజునాథ కట్టిమని కుష్టగిలోని  కెనరా బ్యాంకులో   అటెండర్‌గా పనిచేస్తున్నాడు. మంజుల (25) స్థానిక   తాలూకా  ప్రభుత్వ ఆసుపత్రిలో  ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది.

మంజునాధ్ మరోక మహిళతో సన్నిహితంగా ఉంటున్న విషయం మంజులకు తెలిసింది.  ఈ విషయమై ఒకరోజు భర్తను నిలదీసింది.  అప్పటి నుంచి వారి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి.  తరచూ ఇద్దరూ గొడపవడుతున్నారు. గతనెల 29 గురువారం సాయంత్ర భార్య భర్తలిద్దరూ హోటల్ కి వెళ్లి డిన్నర్ చేసారు.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆవేశంలో ఉన్న మంజునాధ్ సెల్ ఫోన్ చార్జర్ తీసుకుని… దాని  వైరుని  భార్య మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు.  దీంతో మంజుల ఊపిరాడక కన్ను మూసింది. భార్య మృతదేహాన్ని కొప్పళ్ల రోడ్డులో కదళినగర వద్ద పొలంలో పడేసి వచ్చాడు.

శుక్రవారం ఉదయం  స్ధానికులు కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు   సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు గుర్తు తెలియని మృతదేహాంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  విచారణలో  స్థానిక   తాలూకా  ప్రభుత్వ ఆసుపత్రిలో  ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసే మంజులగా గుర్తించారు. ఆమె భర్త మంజునాధ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.