Husband Locked Wife : భార్యను 11 ఏళ్లుగా ఇంట్లోనే బంధించిన భర్త

విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.

Husband Locked Wife : విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు. గోదావరి మధుసూధన్ అనే న్యాయవాది. చుట్టుపక్కల వారికి విషయం తెలిసినా న్యాయవాది కావడంతో ప్రశ్నించడానికి భయపడ్డారు. వివాహిత తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని మధుసూదన్ ఇంటికి వచ్చారు. పోలీసులు సెర్చ్ వారెంట్ చూపి ఇంట్లోకి వెళ్లగా బక్క చిక్కిపోయి గుర్తు పట్టలేనంత విధంగా బాధితురాలు సాయి సుప్రియ కనిపించింది. మధుసూదన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధితురాలు సుప్రియను కోర్టులో హాజరు పర్చారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియకు విజయనగరంలో ఉండే గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది.

Hijab Row: బుర్ఖా వేసుకోను అన్నందుకు హిందూ భార్యను హతమార్చిన భర్త

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యను ఇంట్లో బంధించాడని బాధితురాలి పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. కూతురు గురించి ఎన్ని సార్లు ఆరా తీసినా న్యాయవాది వృత్తి అడ్డుపెట్టుకుని మధుసూదన్ బెరిరించేవాడని వాపోయారు. ఫిబ్రవరి 28న ఎస్పీ ఆదేశాలతో పోలీసులు వెళ్లినా వెనక్కి తిరిగి పంపించారు. దీంతో కోర్టు ఆదేశాలతో సర్చ్ వారెంట్ తీసుకుని వెళ్లి బాధితురాలికి పోలీసులు విముక్తి కల్పించారు.

ట్రెండింగ్ వార్తలు