సహోద్యోగి భార్యతో సంబంధం….బెడ్ రూంలో దొరికిపోవటంతో..

  • Published By: murthy ,Published On : May 18, 2020 / 09:52 AM IST
సహోద్యోగి భార్యతో సంబంధం….బెడ్ రూంలో దొరికిపోవటంతో..

తమ వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్యచేసిందా ఇల్లాలు. అప్పులు తీర్చలేక నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయాడని  సమాజానికి కొత్త కధలు చెప్పటం ప్రారంభించింది. తీగలాగితే డొంక కదిలినట్టు అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తుంటే ఆ కేసులో దోషి ఈ ఇల్లాలే అని తేలింది. 

తమిళనాడులోని కడలూరు జిల్లా  ఊమంగళం ప్రాంతానికి చెందిన సుధ, శ్రీధరన్ దంపతులు, శ్రీధరన్ స్ధానికంగా ఉన్న ఒక కళాశాలలో బస్ డ్రైవర్ గా పని చేసేవాడు. అతనికి అదే కాలేజీలో పనిచేసే శివరాజ్ తో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం మరింత పెరిగి శివరాజ్, తరచూ శ్రీధరన్ ఇంటికి వచ్చిపోవటం జరుగుతూ ఉండేది. 

ఈక్రమంలో శ్రీధరన్ భార్య సుధతో శివరాజ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. శ్రీధరన్ కు తెలియకుండా సుధ, శివరాజ్ తో రాసలీలలు సాగించేది. వారి రాసలీలలు చాలాకాలం పాటు కొనసాగాయి. పాపం ఎప్పటికైనా పండుతుందన్నట్లు ఒకరోజు శివరాజ్, సుధ రాసలీలల్లో మునిగి ఉండగా….ఉన్నట్లుండి శ్రీధరన్ ఇంటికి వచ్చాడు. 

తన బెడ్ రూంలో జరుగుతున్న రాసలీలలు గమనించాడు. అభ్యంతరకరమైన పరిస్ధితుల్లో ఉన్నసుధ, శివరాజ్ లను చూసి కోపంతో ఊగిపోయాడు. దీంతో ఇద్దరినీ తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి  అడ్డుగా ఉన్న శ్రీధరన్ ను అంతమొందించాలని సుధ, శివరాజన్ నిర్ణయించుకున్నారు. ఎదురుగా ఉన్న బెల్టు తీసుకుని శ్రీధరన్ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి పరలోకాలకు పంపించారు. 

కొద్దిసేపటి తర్వాత శవాన్ని బెడ్ షీట్ లో చుట్టి మంచం కింద దాచి పెట్టారు. ఏమి తెలియనట్లు ఆసాయంత్రం గడిపారు. రాత్రి అయ్యాక శ్రీధరన్ మృతదేహాన్ని బయటకు తీసిన శివరాజ్….కారులో తీసుకెళ్లి సమీపంలోని జీడిమామిడి తోటలో పెట్రోల్ పోసి తగల బెట్టాడు.
 
మర్నాడు తన భర్త కనపడటంలేదంటూ సుధ కట్టు కధలు చెపుతూ ఏడుపు ప్రారంభించింది. చేసిన అప్పులు తీర్చలేక నన్నొదిలేసి పారిపోయాడని కధలు చెప్పటం మొదలెట్టింది. ఈలోగా….ఊమంగళంలోని  జీడిమామిడి తోటలో గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

2019 జులై 13న, ఐపీసీ సెక్షన్ 174 కింద..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేపట్టిన పోలీసులకు కొంతకాలం క్రితం కనపడకుండాపోయిన శ్రీధరన్ భార్య  సుధ ప్రవర్తన మీద అనుమానం కలిగింది. ఆమెపై  కొన్నాళ్లు  నిఘా  పెట్టిన పోలీసులు ఒకరోజు అదుపులోకి తీసుకుని  ప్రశ్నించారు. పోలీసు విచారణలో  సుధ నేరం ఒప్పుకోవటంతో…  గత బుధవారం మే 13న దోషులు సుధ, శివరాజ్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

Read : పెళ్లైతే ఆంటీని విడిచి ఉండాల్సి వస్తుందని సూసైడ్