కాపురంలో TikTok చిచ్చు : మొదటి భార్య హత్యకు భర్త ప్లాన్
టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా

టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా
టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా లేదు. అంతా అడిక్ట్ అయిపోయారు. టిక్ టాక్ లో మునిగి తేలుతున్నారు. టిక్ టిక్ కారణంగా కొంతమంది పాపులర్ అయ్యారు. అదే సమయంలో ఈ యాప్ కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయి. క్రిమినల్స్ గా మారుతున్నారు. మర్డర్లు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
టిక్ టాక్ ద్వారా లేనిపోని పరిచయాలు పెంచుకొని జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి టిక్ టాక్ కారణంగా సొంత భార్యనే మర్డర్ చేయాలని చూశాడు. టిక్ టాక్ మహిళ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. మొదటి భార్యను హత్య చేసేందుకు భర్త ప్లాన్ వేశాడు.
విజయవాడకు చెందిన సత్యరాజు వీటీపీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి పెళ్లైంది. భార్య ఉండగానే టిక్‌టాక్‌లో మరో మహిళతో సత్యరాజు పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగలేదు. పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. పరిచయమైన మహిళను భార్యకు తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా కొన్నాళ్లు ఎలాగో మెయింటేన్ చేశాడు. ఓ రోజు మొదటి భార్యకు విషయం తెలిసిపోయింది.
పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో సత్యరాజు భయపడ్డాడు. భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ సత్యరాజు కుట్రను ముందే తెలుసుకున్న భార్య తప్పించుకుంది. భర్తపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పచ్చని కాపురంలో టిక్ టాక్ చిచ్చు రేపిందని మొదటి భార్య బంధువులు వాపోయారు. టిక్ టాక్ కారణంగా తమ కూతురి సంసారం నాశనమైందని తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు.