పార్శిల్‌తో ఉడాయించిన బైక్ రైడర్.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

ఉబర్ బైక్ ద్వారా పంపిన పార్శిల్ మాయమైన ఘటన తాజాగా హైదరాబాద్‌లో క‌ల‌క‌లం రేపింది. బాధితుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Hyderabad Bike Rider: హైదరాబాద్ నగరంలో బైక్ రైడ్స్ సర్వసాధారణంగా మారాయి. టైముకి ఆఫీస్‌కు వెళ్లడానికి ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లడానికి స్టూడెంట్స్.. ఇలా నగర వాసులు తమ అవసరాల కోసం బైక్ రైడ్స్ యూజ్ చేస్తున్నారు. రాపిడో, ఉబర్ సహా పలురకాల సంస్థలు బైక్ రైడ్స్ సర్వీసులు అందిస్తున్నాయి. హైదరాబాదీలు తమ గమ్యాలను సులువుగా చేరుకోవడానికి ఈ పెయిడ్ బైక్ రైడ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రయాణానికే కాకుండా ఇతర సర్వీసులకు కూడా బైక్ రైడ్స్ వాడుతున్నారు. ఇలాంటి సేవలు ఒక్కోసారి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

ఉబర్ బైక్ ద్వారా పంపిన పార్శిల్ మాయమైన ఘటన తాజాగా హైదరాబాద్‌లో క‌ల‌క‌లం రేపింది. ఉబర్ బైక్ రైడర్‌తో పంపిన పార్శిల్ రీచ్ కాకపోవడంతో ఓ యువకుడు ఉబర్ యాప్‌లో ఫిర్యాదు చేశాడు. సదరు సంస్థ బైక్ రైడర్‌ పర్సనల్ ఫోన్ నంబర్ ఇచ్చి.. చేతులు దులుపుకుంది. ఫోన్ చేసి పార్శిల్ గురించి అడిగితే బైక్ రైడర్‌ అభిలాష్ దురుసుగా మాట్లాడినట్టు బాధిత యువకుడు వాపోయాడు. ఈ మేరకు అతడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, పెయిడ్ బైక్ రైడ్స్ సర్వీసులు వినియోగించే వారు తగు జాగ్రత్తలు పాటించాలని నగర ప్రజలకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. బైక్ రైడ్స్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

Also Read: సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

ట్రెండింగ్ వార్తలు