Police Seize Money : హైదరాబాద్‌లో కలకలం.. వాహనంలో తరలిస్తున్న కోటి 50లక్షలు సీజ్

వాహనంలో ఉన్న వారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడం, సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

Police Seize Money : ఎన్నికల వేళ హైదరాబాద్ లో నోట్ల కలకలం రేగింది. పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఏకంగా కోటి రూపాయల 50లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో తరలిస్తున్న మూడు బ్యాగుల్లో డబ్బు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో ఉన్న వారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడం, సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తనిఖీల్లో కోటి 50లక్షలు పట్టుబడటం సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తరలించేందుకు ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ డబ్బు ఎవరిది? ఆ వ్యక్తులు ఎవరు? డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఎన్నికల వేళ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను క్షుణంగా చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ నగదు పట్టుబడటం కలకలం రేపింది. కారులో పట్టుబడిన కోటి 50లక్షల రూపాయల నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పత్రాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో నగదు తరలించేందుకు ప్రయత్నం చేయడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా అంత డబ్బును తరలించే ప్రయత్నం చేయడంతో మరో కేసు నమోదు చేశారు.

Also Read : తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్

 

ట్రెండింగ్ వార్తలు