Honey Trap : హనీట్రాప్‌ వల్లే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ?

బెంగుళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు ఈ నెల 12 ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం డెత్ నోట్ బయటపడటంతో కేసు  కొత్త మలుపు తిరిగింది.

Honey Trap : హనీట్రాప్‌ వల్లే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ?

Karnataka Bjp Leader

Updated On : May 17, 2022 / 4:21 PM IST

Honey Trap : బెంగుళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు ఈ నెల 12 ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం డెత్ నోట్ బయటపడటంతో కేసు  కొత్త మలుపు తిరిగింది.

అనంతరాజుకు ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఆమె తమ ప్రేవేట్ ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిందని… దీని వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అనంతరాజు ఆ లేఖలో పేర్కోన్నాడు. పరాయి స్త్రీ వలలో చిక్కుకుని నీకు మోసం చేశానని భార్యకు క్షమాపణలు చెప్పాడు.

కేఆర్ పుర కు చెందిన రేఖ అనే మహిళ, అనంతరాజుకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చూపించి ఆమె అనంతరాజును బ్లాక్ మెయిల్ చేయసాగింది.

రేఖ అడిగినప్పుడల్లా అనంతరాజు  డబ్బులు ఇచ్చాడు. రోజు రోజుకూ ఆమె నుంచి డబ్బు కోసం ఒత్తిళ్లు పెరగటంతో ఇంట్లో చెప్పుకోలేక మానసికంగా తట్టుకోలేక  ఈనెల 12న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాడర హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Andhra Pradesh : కారులో తరలిస్తున్న రూ.3 కోట్లు స్వాధీనం