లాటరీ ‘స్కామ్’ : స్మార్ట్ ఫోన్ల పేరుతో.. కట్టర్లు పంపించాడు

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2019 / 06:20 AM IST
లాటరీ ‘స్కామ్’ : స్మార్ట్ ఫోన్ల పేరుతో.. కట్టర్లు పంపించాడు

Updated On : October 30, 2019 / 6:20 AM IST

కర్ణాటకలో ఓ టెలీమార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. లాటరీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేశాడు. లక్కీ డ్రా కింద మెబైల్ ఫోన్స్,వాషింగ్ మిషన్ గిఫ్ట్ లు,ఫ్రిడ్జ్ లు అంటూ ఆశ చూపించి చివరికి కూరగాయలు కోసుకునే చాకులు,కట్టర్ లను డెలివరీ చేసి రామనగర పోలీసులు చేతిలో అరెస్ట్ అయ్యాడు.

చిక్కబల్లాపుర జిల్లాలోని బాగేపల్లి తాలుకాలోని ఇవరపల్లి గ్రామ నివాసి అయిన పి.సతీష్(35) రెండు కాల్ సెంటర్లు ప్రారంభించాడు. చింతామణిలో ప్రారంభించిన కాల్ సెంటర్ లో 18మంది మహిళలను ఉద్యోగులు నియమించుకున్నాడు. మైసూరు కాల్ సెంటర్ లో 5గురు మహిళలను నియమించుకున్నాడు. ఆ కాల్ సెంటర్ లలోని మహిళలు ర్యాండమ్ గా నెంబర్లకు ఫోన్ చేసి లక్కీ డ్రా స్కీమ్ నిర్వహిస్తున్నాము…మంచి గిఫ్ట్ లు ఇస్తామంటూ తియ్యగా మాట్లాడతారు. మీ ఏరియాల్లోని పోస్ట్ ఆఫీసుల్లో పోస్టల్ ఛార్జీలు,జీఎస్టీ ఛార్జీలు కట్టిన తర్వాత మీకు గిఫ్ట్ లు అందుతాయంటూ బాధితులకు చెప్పారు. అయితే చివరకి తమకు వచ్చిన పార్శిల్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఛీప్ గిఫ్ట్ లు,వెజిటేబుల్ కట్టర్ లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు బాధితులు. 

ఓ బాధితుడి కంప్లెయింట్ తో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు శంకర్ నగర్,బెంగళూరు,తదితర ప్లేస్ లలో ఉన్న సతీష్ కు చెందిన గోడౌన్స్ లో రైడ్ చేశారు. సతీష్ కి చెందిన ఓ కారు, వెజిటేబుల్ కట్టర్స్ ఉన్న 60గిఫ్ట్ బాక్స్ లు,70రిటర్న్ వచ్చిన గిఫ్ట్ బాక్సులు,కాల్ సెంటర్ సిబ్బంది ఉపయోగించిన 27మొబైల్ ఫోన్ లు,సిమ్ కార్డులు,ఓ ల్యాప్ టాప్,కంప్యూటర్,ప్రింటర్,ఇతర మెటీరియల్స్ ని పోలీసులు సీజ్ చేశారు. సతీష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రామనగర పోలీసులు తెలిపారు