వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కీచక సీఐ..! మైనర్ బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి..!

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఓ పోలీస్ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. దారి తప్పాడు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కీచక సీఐ..! మైనర్ బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి..!

Updated On : October 24, 2024 / 1:23 AM IST

Pocso Case On CI : వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కీచక సీఐ బాగోతం బయటపడింది. పోలీస్ ఇన్ స్పెక్టర్ మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడి చివరికి కటకటాలు కౌంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో సీఐపై లైంగిక వేధింపులతో పాటు పోక్సో కేసు నమోదైంది. కిరాయికి ఉంటున్న అపార్ట్ మెంట్ లో బాలికపై సీఐ రవికుమార్ కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో తన రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సీఐ చెర నుంచి తప్పించుకున్న బాలిక.. పేరెంట్స్ కి విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఐని మల్టీజోన్-1 ఆఫీస్ కు సరెండర్ చేశారు ఉన్నతాధికారులు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఓ పోలీస్ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. దారి తప్పాడు. అతడి ఆగడాలు శ్రుతి మించాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కీచక సీఐ బాగోతం బట్టబయలైంది. మైనర్ బాలికను లైంగికంగా వేధించాడో ఖాకీ. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో సీఐ రవికుమార్ నివాసం ఉంటున్నాడు. సీఐ రవికుమార్ ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెకు సంబంధించి ఎవరూ లేని సమయంలో బాలికను తన రూమ్ లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతేకాదు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు సీఐ రవికుమార్. దాంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేకపోయింది. అయితే, కొన్ని రోజులు మౌనంగా బాధను భరించిన బాలిక.. చివరికి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీఐ రవికుమార్ పై చర్యలు చేపట్టారు. కాగా, ఈ విషయం బయటకు రాకుండా సీఐని ఐజీ ఆఫీస్ కి సరెండర్ చేశారు. ఆ తర్వాత సీఐపై పోక్సో కేసు, అత్యాచారయత్నం కేసు, వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సంచలనం రేపింది.

 

Also Read : దారుణం.. చైన్ కోసం మహిళను ఎలా ఈడ్చుకెళ్లారో చూడండి.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో..