Online classలకు హాజరుకాలేక బాలిక ఆత్మహత్య

  • Published By: Subhan ,Published On : June 2, 2020 / 10:41 AM IST
Online classలకు హాజరుకాలేక బాలిక ఆత్మహత్య

Updated On : June 2, 2020 / 10:41 AM IST

లాక్‌డౌన్ సమయంలోనూ చదువుకు ఆటంకం కలగకూడదని కొన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టేశాయి. టెక్నాలజీ వాడకంలో మరింత ముందున్న కేరళ ఈ పద్ధతిలో చాలా ఫాస్ట్‌గా ఉంది. ఈ క్రమంలో మలప్పురం జిల్లాలోని ఓ బాలిక ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నానని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. 

టెక్నాలజికల్ క్లాసులకు అటెండ్ అవడం ఆమెకు కుదరకపోవడం ఇలా జరిగిందని విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్ జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేశారు. వలంచేరి దగ్గర్లోని మంగేరీ ప్రాంతంలో ఉన్న ఇంటింకి దగ్గర్లో 14ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. రోజువారీ కూలీ అయిన తన తండ్రి మిస్సింగ్ అయినట్లు గుర్తించి వెదకడంతో ఆమె దొరికింది. 

ప్రాథమిక విచారణలో దీనిని ఆత్మహత్యగా గుర్తించారు. చావుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేఎమ్ షాజీ చెప్పారు. మొదటి రోజు క్లాసులకే తాను హాజరుకాలేకపోయానని.. తమ కూతురు కుమిళిపోయిందంటూ తల్లీదండ్రి వాపోయారు. రిపేర్లతో మూలన పడి ఉన్న టీవీ స్థానంలో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు కొనుక్కోలేని దుస్థితిలో ఉంది ఆ కుటుంబం. 

1నుంచి 12తరగతులకు వర్చువల్ క్లాసులు నేర్పేందుకు KiTE Victers television channel వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై సిద్ధమైంది. బాలిక తండ్రి కన్నీటి పర్యంతమవుతూ..  క్లాసులు స్టార్ట్ అయ్యేనాటికి టీవీ కొంటానని నా కూతురితో చెప్పా. అలా కుదరకపోతే స్కూల్ వారు తాత్కాలికంగా ట్యాబ్లెట్ ఇస్తారని, పొరుగింట్లో దానిని చూస్తానని ఆమె నాతో చెప్పిందని ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని కుటుంబం వాపోతుంది.