Gangster Team Caught: వామ్మో.. గంజాయితో పాటు రివాల్వర్లు, మారణాయుధాలు.. షాక్‌లో ఖమ్మం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌‌ అధికారులు..

కేరళ కొచ్చిలో గ్యాంగ్‌స్టర్‌ బిలాల్‌పై 100కు పైగా కేసులు ఉన్నాయి. 28సార్లు శిక్షలు అనుభవించాడు. ఈ మధ్యనే..

Gangster Team Caught: ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం గంజాయిపై స్పెషల్‌ ఫోకస్ తో దాడులు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ పెద్ద మొత్తంలో దాడులు నిర్వహించి గంజాయిని పట్టుకుంది. ఈ దాడులను నిరంతరం కొనసాగించాలని ఎక్సైజ్ శాఖ సిబ్బందిని అదేశించారు.

మధ్యప్రదేశ్‌ భోపాల్‌ లో మారణాయుధాలు కొనుగులో చేసి ఒరిస్సాలో క్వింటాల్ గంజాయి కొని కేరళలోని కొచ్చిన్‌కు ఐచర్‌ వాహనంలో వెళ్తున్న క్రమంలో పాల్వంచ లక్ష్మీదేవ్‌పల్లి సమీపంలో ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ పట్టుకుంది. (Gangster Team Caught)

106 కేజీల గంజాయి, పిస్తల్‌, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్స్‌..

ఐచర్‌ వాహనంలో తనిఖీలు చేయగా గంజాయితో పాటు మరణాయుధాలు పట్టుబడడంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సిబ్బంది విస్తుపోయారు. ఐచర్‌ వాహనంలో 106 కేజీల గంజాయి, రూ.35వేల నగదు, పిస్తల్‌, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్స్‌, 12 ఖాళీ మ్యాగ్జిన్లను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న గంజాయి విలువ రూ. 53 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ కు పిస్తల్స్ లభించడం ఇదే తొలిసారి.

పట్టుబడిన వారు కేరళకు చెందిన గ్యాంగ్ స్టర్ టీమ్ గా గుర్తించారు.(Gangster Team Caught)

రెండు వాహనాలు, మారణాయుధాలను సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బిలాల్‌(30), శ్యామ్‌ సుందర్‌ (30), కాశీనందన్‌ సంతోష్‌ (31)లు ఉన్నారు. తిరుచ్చికి చెందిన జేమ్స్ పరారీలో ఉన్నాడు.

వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి తెలిపారు.

నిందితులది మొదటి నుంచి నేర చరిత్రనే అని తెలిపారు. గంజాయి, మరణాయుధాలతో పట్టుబడిన నిందితులు కేరళలో గ్యాంగ్‌స్టర్‌ టీమ్‌గా చెలామణి అవుతున్నారని చెప్పారు. కేరళ కొచ్చిలో

బిలాల్ పై 100కుపైగా కేసులు..

గ్యాంగ్‌స్టర్‌ బిలాల్‌పై 100కు పైగా కేసులు ఉన్నాయి. 28సార్లు శిక్షలు అనుభవించాడు. ఈ మధ్యనే 8 సంవత్సరాలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడడానికి మారణాయుధాలను భోపాల్‌ నుంచి కొనుగోలు చేశాడు.

రెండో నిందితుడు తమిళనాడుకు చెందిన శ్యామ్‌ సుందర్‌ గంజాయి వ్యాపారంలో అరితేరిన వ్యక్తి. ఈ కేసులో మూడో వ్యక్తి డ్రైవర్‌గా మాత్రమే వచ్చాడు. (Gangster Team Caught)

తమిళనాడుకు చెందిన జేమ్స్‌కు నేర చరిత్ర ఉంది. ఎక్సైజ్‌ అధికారులు మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు.

Also Read: మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య అదే మద్యంలో ఎలుకల మందు కలుపుకుని..