Kochi Tattoo Artist : టాటూలు వేసే నెపంతో ఏడుగురు మహిళలపై అత్యాచారం

టాటూలు వేసే నెపంతో ఒక యువుకుడు ఏడుగరు యువతులపై అత్యాచారం చేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.

Kochi Tattoo Artist : టాటూలు వేసే నెపంతో ఒక యువుకుడు ఏడుగరు యువతులపై అత్యాచారం చేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ….. కేరళలోని ఎటప్పళ్లిలో సుజీష్(35) అనే వ్యక్తి టాటూలు వేసే స్టూడియో నడుపుతున్నాడు. దీంతో ఒక యువతి (18) టాటూలు వేయించు కునేందుకు అతని స్టూడియోకు వెళ్లింది. టాటూ వేసే నెపంతో సుజీష్ ఆయువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని బాధితురాలు  రెడ్డిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పోస్ట్ ఆధారంగా ఎర్నాకులం పోలీసులు సుజీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ విషయం బయటకు రావటంతో అతడి చేతిలో మోసపోయిన మరో ఆరుగురు మహిళలు కూడా ఆ పోస్టులో తాము కూడా సుజీష్ చేతిలో మోసపోయినట్లు పేర్కోన్నారు. సుజీష్ వారిపై చేసిన లైంగికవేధింపులను పోలీసులకు  వివరించారు.

ఈ తంతంగం అంతాబయటకు రావటంతో సుజీష్ పరారీ అయ్యాడు. అతడిని పట్టుకోటానికి పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి తన లాయర్ ను కలవటానికి వస్తుండగా సుజీష్ ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.   దీంతో పోలీసులు నిందితుడిపై 164 బి సెక్షన్  కింద కేసులు నమోదు చేసారు. ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించి  మెజిస్ట్రేట్ ముందు  హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Russia – Ukraine War: యుక్రెయిన్ విద్యార్థుల కోసం ఇండియాకు చివరి విమానం
సుజీష్ గత 10 ఏళ్లుగా టాటూ స్టూడియో నిర్వహిస్తున్నాడు. మహిళలు టాటూలు వేయించుకోవటం బహిరంగంగానే జరిగిందని… అతను ఎవరినీ  లైంగికంగా వేధించలేదని  అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పారు.  ఇది వ్యాపార పోటీలో భాగంగా జరిగిన కుట్ర లో భాగమే అని అతని స్నేహితులు పేర్కోన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు