Kothagudem Medical College : రాత్రి పూట వీడియోలు తీసి వేధింపులు.. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన

తమ డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు చేశారు.

Kothagudem Medical College : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద మెడికల్ విద్యార్థుల ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, బూతులు తిడుతూ వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. తమ డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు చేశారు. రాత్రి వేళల్లో హాస్టల్ వద్దకు అటెండర్లను పంపుతూ వీడియోలు తీస్తున్నారని, ప్రిన్సిపల్ సైతం వచ్చి ఇబ్బందికి గురి చేస్తున్నారని విద్యార్థుల ఆరోపించారు.

అంతేకాదు మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయి ఎక్విప్ మెంట్ లేదని, సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా మెడికల్ కళాశాల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. కాలేజీకి వెళ్ళడానికి ప్రభుత్వం ఉచిత బస్సులను ఏర్పాటు చేసినా కాలేజీ వాళ్ళు ఒక్కో స్టూడెంట్ వద్ద 20వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

వెంటనే అధికారులు స్పందించాలని ప్రిన్సిపాల్, అటెండర్లను తొలగించి తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. విద్యార్థులకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం బైఠాయించింది. ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

Also Read : గ్రేటర్ టొరంటోలో భారీగా కార్ల దొంగతనాలు.. ఇంటి బయటే కార్ల కీలను వదిలేయమన్న పోలీసులు!

ట్రెండింగ్ వార్తలు