Toronto Police : గ్రేటర్ టొరంటోలో భారీగా కార్ల దొంగతనాలు.. ఇంటి బయటే కార్ల కీలను వదిలేయమన్న పోలీసులు!

Toronto Police : కార్ల దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఇళ్లలోకి చొరబడి మరి కార్లను చోరీ చేస్తున్నారు. వరుస కార్ల దొంగతనాలతో ఈ ప్రాంతంలోని వారిని పోలీసులు అప్రమత్తం చేశారు.

Toronto Police : గ్రేటర్ టొరంటోలో భారీగా కార్ల దొంగతనాలు.. ఇంటి బయటే కార్ల కీలను వదిలేయమన్న పోలీసులు!

Leave car keys at front door for thieves, advises Toronto Police

Toronto Police : గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో కార్ల దొంగతనాలు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కార్ల దొంగతనాలను అడ్డుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో టొరంటో పోలీసులు ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. గ్రేటర్ టొరంటో ఏరియాలోని నివాసితులను తమ కారు కీలను వారి ఇంటి బయట ఉంచాలని పోలీసులు కోరారు.

కార్ల దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఇళ్లలోకి చొరబడి మరి కార్లను చోరీ చేస్తున్నారు. వరుస కార్ల దొంగతనాలతో ఈ ప్రాంతంలోని వారిని పోలీసులు అప్రమత్తం చేశారు. టొరంటో సిటీ న్యూస్ ప్రకారం.. 2022తో పోలిస్తే.. 2023లో జీటీఏలో కార్ల దొంగతనాలు దాదాపు 25శాతం పెరిగాయి. అదే కాలంలో కార్ల దొంగతనం కోసం ఇళ్లలోకి చొరబడి తాళాలను పగలగొట్టిన ఘటనలు 400శాతం పెరిగాయి. ఫలితంగా, టొరంటో పోలీసులు నివాసితుల రక్షణ కోసం నిరోధక చర్యలను చేపట్టారు.

Read Also : Congress: కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన ఎలా ఉంది? ఏమేం చేసింది?

ఇందులో వెలుతురు ఉన్న డ్రైవ్‌వేలు, భద్రతా కెమెరాలు, సీసీ కెమెరాల వంటి గృహ భద్రతా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. అయితే, గత నెలలో ఎటోబికోక్ భద్రతా సమావేశంలో కానిస్టేబుల్ మార్కో రికియార్డి చేసిన సూచన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్ రికియార్డి నివాసితులను తమ కీలను దొంగల కనిపించేలా ఫ్రంట్ డోర్ వద్ద ఫెరడే పర్సులో (విద్యుదయస్కాంత సంకేతాలను నిరోధించే ప్రత్యేక బ్యాగ్) వదిలివేయాలని సూచించారు.

దొంగలు ఇళ్ల ధ్వంసానికి పాల్పడే సమయంలో హింసాత్మక ఘటనలను అరికట్టవచ్చు. ఇంట్లో వారు దొంగల దాడికి గురయ్యే అవకాశాన్ని నిరోధించడానికి మీ కారు కీని ఇంటి ముందు తలుపు వద్ద వదిలివేయండి.. దొంగలకు మీ కారు తప్ప ఇంకేమీ అక్కర్లేదని కానిస్టేబుల్ రికియార్డీ సూచించడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. మార్కో రికియార్డి సూచనలపై నెటిజన్ల ఆగ్రహాన్ని రేకిత్తించాయి.

Read Also : Microsoft Copilot Pro : గ్లోబల్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ ఏఐ కోపిలట్ ప్రో వెర్షన్ రిలీజ్.. అదిరే ఫీచర్లు, భారత్‌లో ఈ మోడల్ ధర ఎంతంటే?