ఎయిర్ పోర్టులో చిరుత.. పాలు పట్టిన పోలీసులు

ప్రయాణికులతో ఎయిర్ పోర్టు కిటకిటలాడుతోంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో దిగిన ఓ ప్రయాణికుడు కంగారుగా చెన్నై ఎయిర్ పోర్టులోకి వచ్చాడు. ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : February 2, 2019 / 01:11 PM IST
ఎయిర్ పోర్టులో చిరుత.. పాలు పట్టిన పోలీసులు

Updated On : February 2, 2019 / 1:11 PM IST

ప్రయాణికులతో ఎయిర్ పోర్టు కిటకిటలాడుతోంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో దిగిన ఓ ప్రయాణికుడు కంగారుగా చెన్నై ఎయిర్ పోర్టులోకి వచ్చాడు. ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

ప్రయాణికులతో ఎయిర్ పోర్టు కిటకిటలాడుతోంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో దిగిన ఓ ప్రయాణికుడు కంగారుగా చెన్నై ఎయిర్ పోర్టులోకి బ్యాగుతో వచ్చాడు. ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సిబ్బంది కళ్లుగప్పి ఆ బ్యాగును ఎయిర్ పోర్టులో నుంచి బయటకు తీసుకెళ్లేందుకు యత్నించాడు. కానీ, పోలీసులు ప్రయాణికుడిని పసిగట్టారు. బ్యాగులో ఏముందని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా పారిపోయేందుకు యత్నించి ఎయిర్ పోర్టు పోలీసులకు ప్రయాణికుడు అడ్డంగా దొరికిపోయాడు. అతడు తీసుకెళ్తున్న బ్యాగులో బంగారం లేదు. తొలుత చూడటానికి పిల్లి పిల్లలా అనిపించినా బ్యాగు తెరిచి చూసేసరికి అందులో చిరుతపులి పిల్ల ప్రత్యక్షమైంది. పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నెల రోజుల వయస్సు ఉన్న చిరుత పిల్లను స్మగ్లింగ్ చేస్తున్నట్టు అనుమానించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

భయంతో వణికిపోతున్న చిరుత పులి పిల్లను పోలీసులు దగ్గరికి తీసుకున్నారు. చిరుత కూన ఆకలితో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దానికి పాలు పట్టించారు. అనంతరం ఆ చిరుత పిల్లను చెన్నైలోని అరింగర్ అన్న జూ పార్క్ అధికారులకు అప్పగించారు. జంతువుల స్మగ్లింగ్ యాక్ట్ కింద సదరు ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..