Road Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనాన్ని ఢీకొట్టిన లారీ

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.

Road Accident

Sri Sathya Sai district : శ్రీ సత్య సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగలి మండలం ఇరిగేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోళ్ల మండలం దాసప్ప పాల్యానికి చెందిన 14 మంది పెళ్లి వేడుక ముగించుకొని టాటా ఏసీలో వస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టింది.

Also Read : Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సిమెంట్ లారీ వేగంగా వచ్చి టాటా ఏసీని ఢీనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.