Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident

Updated On : February 10, 2024 / 7:15 AM IST

Nellore District : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తొలుత ఆగిఉన్న లారీని వెనుకనుంచి వేగంగా వచ్చిన మరోలారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Also Read : Haldwani Violence : ఉత్తరాఖండ్‌లో చెలరేగిన హింస.. నలుగురు మృతి, వందల మందికి గాయాలు..

ప్రమాద ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బస్సులో మరో పలువురు ఇరుక్కుపోవటంతో వారిని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు, క్షతగాత్రుల వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.