Jubilee Hills Kidnap : జూబ్లీహిల్స్‌లో కిడ్నాప్ కలకలం.. విజయవాడ నుంచి రెండు కార్లలో వచ్చి..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ప్రేమ జంటను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి ప్రేమ జంటను కాపాడారు.

Jubilee Hills Kidnap : జూబ్లీహిల్స్‌లో కిడ్నాప్ కలకలం.. విజయవాడ నుంచి రెండు కార్లలో వచ్చి..

Updated On : February 18, 2023 / 12:05 AM IST

Jubilee Hills Kidnap : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ప్రేమ జంటను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి ప్రేమ జంటను కాపాడారు.

Also Read..Fraud In Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం.. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి విక్రయం

నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ప్రేమికులు వివాహం చేసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే, వారు పెళ్లి చేసుకోవడం కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీంతో రెండు కార్లలో వచ్చిన కుటుంబసభ్యులు ప్రేమ జంటను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.

Also Read..Young Woman Video Call Cheating : యువతి నగ్నంగా యువకుడికి వీడియో కాల్.. రూ.60 వేలు ఇవ్వకపోతే వీడియో యూట్యూబ్ లో పెడతానని బెదిరింపు

కిడ్నాపర్లను తీవ్రంగా ప్రతిఘటించిన ప్రేమికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాపర్ల నుంచి ప్రేమికులను రక్షించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.