ప్రేమ నేరమా : ప్రేమ జంట ఆత్మహత్య

కొమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని వాంకిడి మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోయాగాం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. భరత్, గౌరు బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇద్దరి ఇంట్లో తెలిసింది. కుటుంబ సభ్యులు వాళ్ల పెళ్లికి నిరాకరించారు. గౌరు బాయిని పేరెంట్స్ మందలించడమే కాకుండా చేయి కూడా చేసుకున్నారు. దీనితో కలిసి ఉండలేమని అనుకున్న గౌరు జనవరి 25వ తేదీ శుక్రవారం పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న భరత్ జనవరి 26వ తేదీ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంతో పాటు రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.