రెస్టారెంట్ వాటర్‌ట్యాంక్‌లో శవాలై తేలిన సిబ్బంది..

  • Published By: nagamani ,Published On : June 6, 2020 / 05:05 AM IST
రెస్టారెంట్ వాటర్‌ట్యాంక్‌లో శవాలై తేలిన సిబ్బంది..

Updated On : June 6, 2020 / 5:05 AM IST

ముంబై శివార్లలోని బార్అండ్ రెస్టారెంట్ వాటర్ ట్యాంక్ లో రెండు శవాలు తేలి ఉండటం స్థానికంగా కలకలం రేగింది. గురువారం (జూన్4,2020)రాత్రి బైటపడిన ఆ రెండు శవాలు ఆ రెస్టారెంట్ సిబ్బందివే కావటం గమనించాల్సిన విషయం. తన రెస్టారెంట్ లో పనిచేసే ఇద్దరు సిబ్బంది కనిపించలేదంటూ షాంబరి రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే..షాపంబరి బార్ లో పనిచేసే నరేష్ పండిట్ (52)హరీష్ శెట్టి (48)ఏళ్ల వ్యక్తులు కొన్ని రోజులుగా కనిపించకుండాపోయారు. రెస్టారెంట్ ప్రాంగణంలోనే ఉంటున్న వీరిద్దరు ఉంటున్నారు. యజమాని ఫోన్ చేసినా ఏమాత్రం స్పందన లేదు. 

లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు షాంబరి రెస్టారెంట్ ను కూడా మూసివేశారు. తిరిగి రెస్టారెంట్ తెరుచుకుంది. రెస్టారెంట్ తీయబోతున్నాం మీరు పనికి రెడీగా ఉండాలని మిస్ అయిన వ్యక్తులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బార్ యజమాని వారి సొంత ఊర్లకు వెళ్లి ఉంటారని భావించాడు. 

కానీ ఓ రోజు రెస్టారెంట్ యజమాని తనకు ఓ ఫోన్ వచ్చిందని కనిపించకుండా పోయిన ఆ ఇద్దరినీ ఎవరో చంపేశారని చెప్పారని పోలీసులకు చెప్పాడు. అలాగే రెస్టారెంట్ పరిధిలో ఏదో దుర్వాసన వస్తోందని రాత్రి 10.30గంటలకు స్థానికులు పోలీసులకు ఫోన్ చేసిన చెప్పారు. 

దీంతో పోలీసులు రెస్టారెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలింపు ప్రారంభించారు. అలా గాలిస్తూ రెస్టారెంట్ వాటర్ ట్యాంక్ ను కూడా పరిశీలించగా రెండు మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించాయి. రెండు మతదేహాలకు పోలీసులు బైటకు వెలికి తీయగా కనిపించకుండా పోయినవారు వీళ్లేనని చెప్పాడు. మృతుల ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. 

సదరు ఇద్దరువ్యక్తుల్ని ఎవరు చంపారు?ఎందుకు చంపారు? పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? లేదా ఈ హత్యలకు రెస్టారెంట్ యజమానికి ఏమన్నా సంబంధాలున్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Read: భర్త ప్రేమ వ్యవహారం తెలిసి నవ వధువు ఆత్మహత్య