చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక నిందితుడు అరెస్టు

Main Culprit Arrested In China Online Betting Apps Case
china online betting case main culprit arrested : చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడైన నైసర్ కొఠారిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో నైసర్ కొఠారీని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
అంతకు ముందు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, చైనాకు చెందిన లిన్ యాంగ్ హు లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితమే చైనా యాప్స్ వ్యవహారాలను హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. చైనాకు చెందిన ఓ కంపెనీ ఇండియాలో ఈ కామర్స్ పేరుతో వందలాది బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చైనా కంపెనీలు మన దేశ ఖజానాను కొల్లగొట్టారని.. దాదాపు 1100 కోట్లను మనీలాండరింగ్ ద్వారా చైనాకు తరలించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో నమోదైన ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.