Cyber Crime : మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు, కట్ చేస్తే 70లక్షలు పోగొట్టుకున్నాడు.. దిమ్మతిరిగిపోయే మోసం

Cyber Crime In Bengaluru : మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు.

Cyber Crime In Bengaluru (Photo : Google)

ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాల గురించి పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ పై నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా స్నేహాలకు దూరంగా ఉండాలని నెత్తీ నోరు బాదుకుని చెబుతూనే ఉన్నారు. ఆన్ లైన్ లో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాల గురించి నిత్యం వింటూనే ఉన్నాము. మోసపోయిన బాధితులను కళ్లారా చూస్తూనే ఉన్నాం.

కొంపముంచిన ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్..
కానీ, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఆన్ లైన్ లో ఫ్రెండ్ షిప్ చేసి అడ్డంగా మోసపోతున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. ఓ మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఏకంగా రూ.70లక్షలు కోల్పోయాడు.

ఆన్ లైన్ లో మహిళతో పరిచయం..
ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు రిటైర్డ్ ఉద్యోగి. వయసు 63ఏళ్లు. చంద్రా లేఔట్ లో ఫేజ్ 1లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆన్ లైన్ లో ఓ మహిళ అక్టోబర్ 1న పరిచయమైంది. తనను మరియా లియోనాస్ మిక్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. దీంతో బాధితుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ మహిళ తన స్కెచ్ స్టార్ట్ చేసింది.

Also Read : విప్రో, ఇన్ఫోనిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ.. ఇంటి దగ్గర నుంచి చేసింది చాలు.. ఇక ఆఫీసుకు రావాల్సిందే..!

విలువైన కానుకల పేరుతో ఘరానా మోసం
ఆయనతో చాటింగ్ చేయడం ప్రారంభించింది. అక్టోబర్ 8న ఆయనకు ఒక మేసేజ్ పంపింది. ఖరీదైన గిఫ్ట్ లు పంపిస్తానని చెప్పింది. ఆ తర్వాతి రోజు.. కానుకలు పంపాను అని ఆయనతో చెప్పింది. అక్టోబర్ 11న ఓ వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు. తాను కస్టమ్స్ అధికారిని అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత నుంచి పెద్దాయనకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఓ వ్యక్తి ఫోన్ చేసి మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు. ఇలా కస్టమ్స్ డ్యూటీ, కరెన్సీ కన్వర్షన్ చార్జీలు, ట్యాక్స్ పేరుతో డబ్బు గుంజాడు.

Cyber Crime In Bengaluru (Photo : Google)

25రోజుల్లో 70లక్షలు చెల్లింపు..
ఇదంతా నిజమే అని నమ్మిన బాధితుడు వారు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటూ వెళ్లాడు. ఇలా 25 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.70లక్షలు చెల్లించాడు. అయితే, కానుకలు మాత్రం అందలేదు. దీంతో తాను మోసపోయానని వృద్ధుడు గ్రహించాడు. లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తాను మోసపోయానని ఫిర్యాదు చేశాడు. తన డబ్బు తనకు తిరిగి వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. ఉద్యోగం చేసే సమయంలో బాధితుడు కొంత డబ్బు దాచుకున్నాడు. ఇక, రిటైర్ మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. అలా 70లక్షలు జమ కాగా.. ఇప్పుడా డబ్బు మొత్తం పోయి రోడ్డున పడ్డాడు.

Also Read : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

అపరిచిత వ్యక్తులతో బీకేర్ ఫుల్..
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. కన్నింగ్ గాళ్లు ఎక్కువైపోయారు. పెద్దగా కష్టపడకుండానే, చెమట చుక్క చిందించకుండానే రెప్పపాటులో సర్వం దోచేస్తున్నారు. మన బలహీనతలు, కక్కుర్తి, దురాశే వారికి పెట్టుబడి. ఆన్ లైన్, సోషల్ మీడియా వేదికగా సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వారి ఎరకు చిక్కామో ఇక అంతే సంగతులు సర్వం కోల్పోవడం ఖాయం. అందుకే సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం. ఇక గుర్తు తెలియని నెంబర్ల నుంచి మెయిల్స్ కానీ మేసేజ్ లకు కానీ స్పందించకపోవడమే మనకు శ్రీరామరక్ష అంటున్నారు.

Cyber Crime In Bengaluru (Photo : Google)

ట్రెండింగ్ వార్తలు