tollywood actress
Hyderabad : తెలుగు సినీ ఇండ్రస్ట్రీకి చెందిన ఒక నటిని వాట్సప్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. స్టార్ మేకర్స్ యాప్ ద్వారా నటి ఫోన్ నెంబరు సంపాదించిన యువకుడు నటి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఆమెను బెదిరించసాగాడు.
వాట్సప్ చాటింగ్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి ఆమెను దూషించసాగాడు. దీంతో భయపడిపోయిన ఆ నటి షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేసుకుంది. చివరికి ధైర్యం చేసి హైదరాబాద్ షీ టీమ్స్ వారికి ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ షీ టీమ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నటికి వస్తున్న ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read : KTR On Age Relaxation : ఆ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లకు పెంపు..! కేటీఆర్ ఏమన్నారంటే..