KTR On Age Relaxation : ఆ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లకు పెంపు..! కేటీఆర్ ఏమన్నారంటే..

కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.

KTR On Age Relaxation : ఆ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లకు పెంపు..! కేటీఆర్ ఏమన్నారంటే..

Ktr On Age Relaxation

KTR On Age Relaxation : కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని తెలంగాణలోని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. కరోనాతో రెండేళ్లు వృథా అయ్యాయని, తాజా నోటిఫికేషన్ లో ఇచ్చిన మూడు సంవత్సరాల సడలింపును మరో రెండేళ్లు అదనంగా పెంచాలని కోరాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. వయో పరిమితి పెంపు అంశాన్ని పరిశీలించాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరతామని ఆ నిరుద్యోగికి భరోసా ఇచ్చారు కేటీఆర్.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో #AskKTR నిర్వహించారు. పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు 90 నిమిషాల పాటు సాగింది. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ పోలీస్ ఉద్యోగాల్లో వయో పరిమితి పెంపు విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.(KTR On Age Relaxation)

Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దాదాపు 17 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 20. అయితే.. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి విషయంలో నిరుద్యోగుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. ఇప్పటికే వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచింది తెలంగాణ సర్కార్. కనీసం ఐదేళ్లయినా పెంచాలని అనేక మంది నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

వయో పరిమితి పెంపు అంశాన్ని పరిశీలించాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరతామని మంత్రి కేటీఆర్ ఇచ్చిన భరోసాతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. మరి హోంమంత్రి మహమూద్ అలీ ఎలా స్పందిస్తారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? చూడాలి.

కాగా, పోలీస్ శాఖలోని అనేక విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,099 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్ఐలతో పాటు 16,027 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.

Telangana Govt jobs : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్‌ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో అత్యధికంగా టీఎస్‌ఎస్‌పీలో 5,010.. సివిల్‌లో 4,965.. ఏఆర్‌లో 4,423 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 23 TSSP సబ్ ఇన్ స్పెక్టర్, 12 SPF ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖ, ఐటీ విభాగంలోనూ పలు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.