Vizianagaram : భార్య గొంతు కోసి, ఆత్మహత్యాయత్నం చేసిన భర్త

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసిన భర్త తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్ధితి విషమించటంతో అతడిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Vizianagaram : భార్య గొంతు కోసి, ఆత్మహత్యాయత్నం చేసిన భర్త

Man attack on wife

Updated On : May 28, 2022 / 6:56 PM IST

Vizianagaram :  విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసిన భర్త తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్ధితి విషమించటంతో అతడిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

జిల్లాలోని గుర్ల మండలం పకీరు కిత్తలి గ్రామానికి చెందిన మామిడి కనకరాజుకు   చీపురుపల్లికి చెందిన వరలక్ష్మీ అనే మహిళతో ఏడాదిన్నర   క్రితం వివాహం అయ్యింది. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. కనకరాజు విజయవాడలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. భార్య వరలక్ష్మి  చీపురుపల్లిలోనే ఉండి హాట్ చిప్స్ షాపులో పని చేస్తోంది.  పెళ్లైనప్పటి  నుంచి భార్యను కాపురానికి రమ్మంటే రాకుండా చీపురుపల్లిలోనే ఉంటోంది. ఈవిషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

దీంతో ఈరోజు ఆమె పని చేస్తున్న షాపు వద్దకు వచ్చి కనకరాజు కాపురానికి రమ్మని భార్యతో గొడవ పడ్డాడు. వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో కనకరాజు  ఆవేశంలో చాకుతో భార్య గొంతు కోశాడు.  అనంతరం తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇది గమనించిన స్ధానికులు వారిద్దరినీ చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు వరలక్ష్మి గొంతుకు కుట్లు వేసి చికిత్స చేయటంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కాగా పురుగుల మందు తాగిన కనకరాజు పరిస్ధితి విషమంగా ఉండటంతో అతడిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read : Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య