Garba Event: కూతుర్ని వేధించిన వ్యక్తులతో తండ్రి వాగ్వివాదం.. ఆ తరువాత ఏం జరిగిందంటే
ఢిల్లీ సమీపంలోని ఓ గర్భా వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్ లోని రెసిడెన్షియల్ సొసైటీలో ఏర్పాటు చేసిన గార్బా కార్యక్రమంలో కుమార్తెను వేధించిన ఇద్దరు వ్యక్తులతో

Prem Mehta
Garba Event Man Died: ఢిల్లీ సమీపంలోని ఓ గర్భా వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్ లోని రెసిడెన్షియల్ సొసైటీలో ఏర్పాటు చేసిన గార్బా కార్యక్రమంలో కుమార్తెను వేధించిన ఇద్దరు వ్యక్తులతో ఆమె తండ్రి ప్రేమ్ మెహతా (52) వాగ్వివాదంకు దిగాడు. ఈ వివాదంలో యువకులు ప్రతిఘటించడంతో అతను మరణించాడు. పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫరీదాబాద్ లోని సెక్టార్ 87లోని ప్రిన్సెస్ పార్క్ సొసైటీలో నివాసముంటున్న ప్రేమ్ మెహతా తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి నివాస సముదాయం ఆవరణలో జరిగిన గర్భా కార్యక్రమంలో పాల్గొన్నారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నుంచి ఇద్దరు యువకులు దాండియా డ్యాన్స్ సమయంలో మెహతా 25ఏళ్ల కుమార్తె వద్దకు వచ్చి ఆమె ఫోన్ నెంబర్ కావాలని అడిగారు. అంతేకాక తమతో కలిసి డ్యాన్స్ చేయాలని కూడా అడిగారు. యువతిపై చేతులు వేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న యువతి తండ్రి మెహతా వేదింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులతో వాగ్వివాదానికి దిగాడు. అతని భార్య, కుమారుడుసైతం వారితో వాగ్వివాదానికి దిగారు. తన కుమార్తె వద్దకు ఎందుకు వచ్చారని ఇద్దరు యువకులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల వారు ఒకరికొకరు కాలర్ పట్టుకొని తోసుకున్నారు.
Also Read : Movie Releases : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ఘర్షణ సమయంలో ఇద్దరు వ్యక్తులు మెహతాను బలంగా నెట్టారు. అతను నేలపై పడి స్పృహ కోల్పోయాడు. వెంటనే మెహతాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఊహించని విషాదంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వయకులపై కేసు నమోదు చేశారు. మృతుదేహాన్ని పోస్ట్ మార్ట్ం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారని పోలీస్ అధికారి జమీల్ ఖాన్ తెలిపారు.