Man Hacked To Death : యువతికి వాట్సప్ మెసేజ్‌లు పంపించాడని యువకుడి హత్య

కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతికి వాట్సప్ మెసేజ్ లు పంపించాడని కొందరు వ్యక్తులు, విపిన్ లాల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.

Man Killed Kerala

Man Hacked To Death :  కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతికి వాట్సప్ మెసేజ్ లు పంపించాడని కొందరు వ్యక్తులు, విపిన్ లాల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. అలప్పుజ జిల్లాలోని పూచక్కల్ వద్ద ఏడుగురు వ్యక్తులు,  తైక్కట్టుసేరికి చెందిన విపిన్‌లాల్‌పై శనివారం రాత్రి దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపారు.

గతంలోనే యువతికి వాట్సప్ మెసేజ్‌లు పంపినందున.. విపిన్ లాల్ ను హెచ్చరించారు. అతను తిరిగి యువతికి వాట్సప్ మెసేజ్ లు పంపించటంతో నిందితులు ఈ దారుణానికి ఒడి గట్టారు. ఈ హత్యకు సంబంధించి సుజీత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాత్యకు పాల్పడిన మరో ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Read Also : AP Covid Report : ఏపీలో కొత్తగా 864 కోవిడ్ కేసులు