Man Raped Woman : మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం .. పెళ్లి పేరుతో లైంగిక దాడి

భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ ద్వితీయ వివాహం కోసం మ్యాట్రిమోనీ సైట్ లో పేరు నమోదు చేసుకుంది.

Man Raped Woman : మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం .. పెళ్లి పేరుతో లైంగిక దాడి

Man Raped Woman On Pretext Of Marriage

Updated On : October 23, 2021 / 8:33 AM IST

Man Raped Woman : భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ ద్వితీయ వివాహం కోసం మ్యాట్రిమోనీ సైట్ లో పేరు నమోదు చేసుకుంది. అందులో పరిచయం అయిన వ్యక్తి పెళ్లి పేరుతో ఆమెపై లైంగిక దాడి చేసి మోసం చేసిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

వడోదరకు చెందిన మహిళ ద్వితీయ వివాహాం చేసుకునేందుకు తన వివరాలను మ్యాట్రిమోనియల్ సైట్ లో రిజిష్టర్ చేసుకుంది. అక్కడ ఆమెకు థ్రుమిత్ సోలంకి (28) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఒకరి వివరాలు మరోకరికి నచ్చటంతో  ఫోన్ నెంబర్లు మార్చుకుని చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. ఈ క్రమంలో ఎలాగూ పెళ్ళి చేసుకుంటున్నాము కదా వ్యక్తిగతంగా కలుద్దామని కోరాడు. అందుకు సరే అంది ఆ మహిళ.

Also Read : Girls Trafficking :  బాలికల అక్రమ రవాణా గుట్టు రట్టు…… ఐదుగురు బాలికలను కాపాడిన డీసీడబ్ల్యూ

సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో విసాత్ ప్రాంతంలో కలుద్దాము రమ్మని కోరాడు. అందుకు సమ్మతించిన మహిళ ఆసమయంలో అక్కడకు వచ్చింది. సమీపంలోని హోటల్ కు తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కదా అని ఆమె అభ్యంతరం చెప్పలేదు. మర్నాడు ఉదయం మహిళ తిరిగి వడోదర వెళ్లిపోయింది.

కాగా…అక్టోబర్ 18వ తేదీన తనకు వేరొక మహిళతో పెళ్లి ఖాయం అయ్యిందని తనను మరిచిపోవాలని సోలంకి బాధితురాలితో చెప్పాడు. నిరాశకు గురైన మహిళ మంగళవారం అక్టోబర్ 19న సోలంకి ని కలవటానికి చంద్‌ఖేడాలోని అతని ఇంటికి వచ్చింది. కాగా నిందితుడు సోలంకి ఆమెను కలవకుండా తప్పించుకు తిరిగాడు. అతడ్ని కలిసేందుకు రెండు రోజుల పాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో బాధితురాలు నిందితుడిపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సోలంకిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.