Encoounter
Maoist Encounter: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పుల కలకలం రేగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ రితేష్ పూణేమ్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతిడిపై రూ.3 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైకా, మోస్లా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.
Also read: AP Budget 2022-23 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,257 కోట్లు
భద్రతా సిబ్బందిని చూసి మావోయిస్టులు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ రితేష్ పూణేమ్ మృతి చెందగా.. రామ్లు హేమ్లా అనే జవాన్ గాయపడ్డాడు. ఘటనా స్థలం నుంచి మావోలు ఉపయోగించిన ఒక ఆయుధం, పిస్టల్, మావోయిస్టుల మెటీరియల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఏడాదిలో ఇదే ప్రాంతంలో వరుసగా ఇది నాలుగో ఎన్కౌంటర్ కావడం గమనార్హం. జనవరి నెలలో రెండు, ఫిబ్రవరి నెలలో ఒక ఎన్కౌంటర్ జరిగాయి.
Also read: AP Political news: లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ