Maoists Sabotage Railway Track : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు-మావోయిస్టుల దుశ్చర్య

దంతేవాడ జిల్లా మల్కన్ గిరి-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారు ఝూమున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Maoists Sabotage Railway Track : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు-మావోయిస్టుల దుశ్చర్య

Maoists Sabotage Railway Track

Updated On : November 27, 2021 / 2:37 PM IST

Maoists Sabotage Railway Track :  దంతేవాడ జిల్లా మల్కన్ గిరి-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారు ఝూమున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజంతో బచేలి నుంచి విశాఖపట్నం వెళుతున్న గూడ్స్ రైలుకు   చెందిన మూడు ఇంజన్లు, ఇరవై వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

బైరామ్‌గఢ్  ఏరియాకు చెందిన మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఈఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న కిరండోల్ రైల్వే అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని రైళ్ల రాకపోకలను తిరిగిత్వరలోనే పునురుధ్దరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
Also Read : Maoists : సర్పంచ్‌ను హతమార్చిన మవోయిస్టులు
భాన్సీ, కమలూర్ స్టేషన్ల మధ్య   బసన్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఇంజన్‌పై మావోయిస్టులు బ్యానర్లు కట్టారు.  ఈ ఘటన జరిగిన ప్రదేశం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఘటనా స్ధలంలో మావోయిస్టుల కరపత్రాలను వదిలి వెళ్ళారు.  గడ్చిరోలి ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ రోజు బంద్‌కు  పిలుపునిచ్చిన నేపధ్యంలో ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.