maried woman ends her life
Hyderabad : భర్త వేదింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని నిజాంపేట్, భవ్య ఆనందంలో నివాసం ఉండే ముమ్మిడి స్పందన(35) ఆదివారం రాత్రి 10గంటల సమయంలో తన గదిలో ఫ్యాను కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రసాద్ తో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. వీరికి ఒక కుమారుడు.
ఆదివారం రాత్రి భార్యా భర్తల మద్య గొడవ తీవ్రస్దాయికి చేరడంతో స్పందన మనస్తాపానికి గురై రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకున్న సమయంలో భర్త ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాడని, భర్త వేధింపులతోనే స్పందన మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
చుట్టుప్రక్కల వారు ఇంటి తలుపులను పగలగొట్టి చూడగా స్పందన ఉరి వేసుకొని ఉండటంతో వెంటనే ఆమెను నిజాంపేట్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
Also Read : Krushna Rout: పార్టీకి పిలిచి.. బాగా తాగిపించి.. రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ చొప్పించిన స్నేహితులు