Minor Girl Pregnant : మైనర్ బాలికను గర్భవతిని చేసిన మైనర్ బాలుడు

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.  మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేయటంతో బాలిక గర్భవతి అయ్యింది. 

Minor Girl Pregnant : మైనర్ బాలికను గర్భవతిని చేసిన మైనర్ బాలుడు

Minors Illegal Affair

Updated On : October 25, 2021 / 12:57 PM IST

Minor Girl Pregnant :  హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.  మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేయటంతో బాలిక గర్భవతి అయ్యింది.  సైదాబాద్   పోలీసు స్టేషన్ పరిధిలో    ఐ.ఎస్‌.సదన్ డివిజన్‌లోని ఓ బస్తీలో 15 ఏళ్ల బాలిక,  వారి ఇంటి ఎదురుగా  ఉన్న కుటుంబంలో 16 ఏళ్ల బాలుడు  వారి వారి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు.

రెండు  కుటుంబాలు దినసరి  కూలీపై  ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంట్లోని  పెద్దవారు ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లేవారు. ఇంట్లో పిల్లలు ఉండేవాళ్లు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోవటంతో  16 ఏళ్ల బాలుడు వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోని 15 ఏళ్ళ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఈ విషయాన్ని బాలుడు, బాలిక గుట్టుగా ఉంచారు.

Also Read :Volunteer Misbehaviour : వివాహితతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన-కేసు నమోదు

శుక్రవారం, అక్టోబర్22వ  తేదీన బాలికకు  విపరీతమైన కడుపునొప్పి రావటంతో  బాలికను ఆస్పత్రికి  తీసుకు వెళ్ళారు. ఆమె ఉదర భాగం చూసి డాక్టర్లకు   అనుమానం వచ్చి పరీక్షలు చేయగా  బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది.  బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు సైదాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు,  నిందితుడైన బాలుడ్ని అదుపులోకి  తీసుకుని  బాలుర సంరక్షణా కేంద్రానికి తరలించారు.  మలక్‌పేట్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో   కేసు దర్యాప్తు చేస్తున్నారు.