Minor Girl Rape : ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని బలవంతంగా వదిలించుకునే ప్రయత్నం చేసింది.

Minor Girl Rape : ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు

Kochi Minor Girl Rape

Updated On : September 4, 2021 / 5:15 PM IST

Minor Girl Rape : కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని బలవంతంగా వదిలించుకునే ప్రయత్నం చేసింది.అందుకోసం ఆస్పత్రి  టాయిలెట్ లో బలవంతంగా ప్రసవించింది.

కేరళలో 18 ఏళ్లు నిండని అత్యాచారం బాధితురాలు గర్భం దాల్చింది.  పరీక్షల నిమిత్తం తల్లిని తీసుకుని బుధవారం కొచ్చిలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ వచ్చి పరీక్ష చేసే లోగా ఆ యువతి బాత్రూం లోకి వెళ్లింది. అక్కడ నెలలు నిండాకుండానే   బలవంతంగా  ప్రసవించేందుకు ప్రయత్నించింది.   తీవ్ర ప్రయత్నం చేయగా కడుపులోని ఆరునెలల పిండాన్ని ప్రసవించింది.

ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఎక్కువ నీళ్లు  పోసి పిండాన్ని టాయిలెట్ షింక్  లోంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించింది.  అది సాధ్యం కాలేదు, పిండం డ్రైనేజి గొట్టాల ద్వారా బయటకు వెళ్లలేదు. ఈలోపు ఈ తతంగాన్ని  గమనించిన ఒక వ్యక్తి ఆస్పత్రి నిర్వాహకులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read : Hanamkonda Petrol Attack : చిట్టీ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు బాలికను అదుపులోకి   తీసుకుని విచారించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాలికపై అత్యాచారం చేసిన 20 ఏళ్ల యువకుడిని అదుపులోకి  తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.