పోర్న్ వీడియో రాకెట్ – ఔత్సాహికులే ఆ నటి టార్గెట్

Model Gehna vasisth paid 15k and 20k for video actors per film : పోర్న్ వీడియా రాకెట్ లో ముంబైకు చెందిన నటి, మోడల్ గెహ్నా వశిష్ట్(వందనా తివారీ) ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను ఆదివారం సిటీ కోర్టులో హజరు పరచగా … కోర్టు ఫిబ్రవరి 10 వరకు పోలీసు కస్టడీ విధించింది.
ఈ క్రమంలో ఆమెను విచారించిన పోలీసుకు పలు కీలక విషయాలు తెలిశాయి. టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించాలి, వెండితెరపై వెలిగి పోవాలనుకునే ఔత్సాహిక నటీనటుల బలహీనతలు ఆసరాగా చేసుకుని, కష్టాల్లో ఉన్న వారిని కనిపెట్టి రూ.15 వేలుకు, రూ.20 వేలకు వారిని పోర్న్ వీడియోల్లో నటించేలా ఎగ్రిమెంట్ చేసుకుని వారిని రొంపిలోకి దింపేదని పోలీసులు తెలిపారు.
ఆ విధంగా ఆమె 87 పోర్న్ వీడియోలు చిత్రీకరించి తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిందని వాటిని చూడాలనుకునే వారి వద్ద నుంచి సబ్ స్క్రిప్షన్ ఫీజు కింద ఒక్కోక్కరి నుంచి రూ.2 వేలు వసూలు చేసిందని తెలిపారు. రెండేళ్ల కాలంలో ఆమె సబ్ స్క్రిప్షన్ల ద్వారా రూ.36లక్షలు ఆర్జించిందని పోలీసులు వివరించారు.
కాగా …. ఈ అంశంపై గెహ్నా వశిష్ట్ తరుఫు న్యాయవాదులు మాట్లాడుతూ.య… పోర్న్ రాకెట్ తో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని, ప్రత్యర్ధులు ఆమెను అపఖ్యాతి పాలు చేయటానికే ఈ కేసులో ఇరికించారని అన్నారు.
‘ఫిల్మీ దునియా’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన గెహ్నా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. 2007లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన 2, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నమస్తే, 33 ప్రేమ కథలు, ఐదు, ప్రేమించు పెళ్లాడు, బీటెక్ లవ్ స్టోరీ వంటి తెలుగు సినిమాలలోనూ ఆమె నటించింది.