Mother Hangs : తీవ్ర విషాదం.. ముగ్గురు కూతుళ్లకు ఉరేసిన తల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది.

Mother Hangs Three Daughters
Mother Hangs Three Daughters : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది. తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు, తల్లి మరణించారు. కాగా, ఉరి జారడంతో మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందారు.
చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తల్లి మరణంతో చిన్నారి శైనీ అనాథగా మారింది.