కంగనా రౌనత్‌పై FIR నమోదుకు కోర్టు ఆదేశాలు

Kangana Ranaut FIR : బాలీవుడ్ నటి కంగనా రౌనత్ సహా ఆమె సోదరి రంగోలి చందేల్‌పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. మతపరమైన అలజడులు సృష్టించేలా రెచ్చగొట్టేలా అభ్యంతర ట్వీట్లు చేసినందుకుగాను కోర్టు ఇరువురిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బంద్రా మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ Jaydeo Y Ghule ఈ ఆదేశాలను జారీ చేశారు. Sahil Ashrafali Sayyed అనే క్యాస్టింగ్ డైరెక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముంబై కోర్టు కంగనాపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతిపై మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అపకీర్తి కలిగించేలా గత రెండు నెలలుగా hub of nepotism, favouritism అంటూ వివాదస్పద ట్వీట్లు చేస్తోందని ఫిర్యాదుదారుడు Sahil తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర కామెంట్లు చేసిందంటూ ఆయన ఫిర్యాదులో తెలిపారు. మతపరంగా బాలీవుడ్ లోని ఆర్టిస్టులను వేరుచేసేందుకు కంగనా ప్రయత్నిస్తోందంటూ సాహిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండు మతపరమైన గ్రూపుల మధ్య మతపరమైన అల్లర్లు సృష్టించేలా సోషల్ మీడియాలో కంగనా సోదరి అభ్యంతర కామెంట్లు పోస్టు చేశారని ఆమెపై కూడా కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో తెలిపారు.