Uttar Pradesh: నిద్రపోవటానికి ఏసీ కూలింగ్ పెంచేసిన డాక్టర్, ఇద్దరు శిశువులు మృతి..
ఓ డాక్టర్ తాను హాయిగా నిద్రపోవానికి ఇద్దరు పసిబిడ్డల్ని చంపేశాడు. తాను హాయిగా ఏసీ వేసుకుని నిద్రపోవటానికి ఇద్దరు శిశువుల ప్రాణాలు బలిపెట్టిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Uttar Pradesh
Uttar Pradesh government hospital: ఓ డాక్టర్ తాను హాయిగా నిద్రపోవానికి ఇద్దరు పసిబిడ్డల్ని చంపేశాడు. తాను హాయిగా ఏసీ వేసుకుని నిద్రపోవటానికి ఇద్దరు శిశువుల ప్రాణాలు బలిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తాను నిద్ర పోవటానికి ఏసీ వేసుకున్నాడు. కూలింగ్ సరిపోలేదు. దీంతో ఏసీ కూలింగ్ పెంచేశాడు. దీంతో అదే రూమ్ లో చికిత్స పొందుతున్న శిశువులు చనిపోయారు. చలికి తాళలేక ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో శనివారం (సెప్టెంబర్ 23,2023) రాత్రి జరిగిందీ ఘటన. డాక్టర్ నీతూ కుమార్ (Neetu Kumar)రాత్రి నిద్రపోవటానికి ఏసీ కూలింగ్ సరిపోలేదని కూలింగ్ పెంచేశాడు. దీంతో అదే రూమ్ లో చికిత్స పొందుతున్న ఇద్దరు శిశువులు చనిపోయారు.
శనివారం కైరానాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(government hospital)లో జన్మించిన ఇద్దరు శిశువలు అదే రోజున చికిత్స కోసం ఓ ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు. అక్కడ చికిత్స కోసం వారిని ఫొటోథెరపీ యూనిట్(Phototherapy unit)కు తరలించారు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్ నీతూ కుమార్ రాత్రి పడుకునే సమయంలో ఏసీ కూలింగ్ పెంచేశాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. కానీ ఉదయం తమ చిన్నారులను చూడటానికి వచ్చిన కుటుంబ సభ్యులకు బిడ్డలు చనిపోయినట్లుగా తెలిసింది. దీనికి కారణం డాక్టర్ నీతూ కుమార్ అంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని సోమవారం (సెప్టెంబర్ 25,2023) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు వారు చనిపోయి కనిపించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నీతూను అరెస్ట్ చేసామని సర్కిల్ ఇన్ స్పెక్టర్ అమర్ దీప్ తెలిపారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. నిందితుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ (Chief Medical Officer Dr. Ashwani Sharma)హెచ్చరించారు.
కాగా నీతూ కుమార్ లైసెన్స్, మెడికల్ డిగ్రీ లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నాడని తమ విచారణలో తేలింది అంటూ అదనపు చీఫ్ మెడికల్ అధికారి (Additional chief medical officer)డాక్టర్ వినోద్ కుమార్ (Dr. Vinod Kumar)తెలిపారు. దీంతో నీతూ కుమార్ క్లినిక్ సీజ్ చేశామని, నీతుపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ (Indian Medical Council Act) (1956) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.