Occult Worship : కర్నూలు జిల్లా ప్రజలను వణికిస్తున్న క్షుద్రపూజలు

అర్ధరాత్రి ఇళ్లముందు పూజలు చేస్తున్నారు.. క్షుద్రపూజలతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇంతకీ ఆ క్షుద్రపూజల వెనుక మంత్రగాళ్లెవరు..? అసలు కర్నూలులో ఏం జరుగుతోంది..?

Occult Worship : కర్నూలు జిల్లా ప్రజలను వణికిస్తున్న క్షుద్రపూజలు

Kurnool Kshudra Poojalu

Updated On : November 3, 2021 / 5:23 PM IST

Occult Worship :  అహ్లాదకరమైన వాతావరణం.. ఆకట్టుకునే అందమైన దృశ్యాలు.. అరుదైన వన్యప్రాణులు.. పురాతన దేవాలయాలు..వీటితో కర్నూలు జిల్లా తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా మారింది. అలాంటి జిల్లాలో ఇప్పుడు మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయ్‌. అర్ధరాత్రి ఇళ్లముందు పూజలు చేస్తున్నారు.. క్షుద్రపూజలతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇంతకీ ఆ క్షుద్రపూజల వెనుక మంత్రగాళ్లెవరు..? అసలు కర్నూలులో ఏం జరుగుతోంది..?

కర్నూలు జిల్లాలోని వెలుగోడులో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం చెలరేగుతోంది. రాత్రి సమయంలో గుర్తుతెలియని వాళ్లు వచ్చి.. క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు జమ్మినగర్‌ తండావాసులు. రాత్రి పడుకోవాలంటే భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక మంది ఇళ్ల దగ్గర ఇలా పూజలు జరుగుతున్నాయని భయపడుతున్నారు. చేతబడి కోసమే పూజలు చేస్తున్నారన్న భయంతో.. తండాలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Also Read : Farmers Attack On Police : పోలీసులపై దాడి చేసిన చెరుకు రైతులు

ఆపరేషన్‌ క్షుద్ర ఎపిసోడ్‌లకి కర్నూలు జిల్లా కేరాఫ్‌గా మారింది. బంగారు నిధుల కోసం నరబలి ఉదంతాలు కూడా ఇక్కడ సాధారణంగా మారాయి. జమ్మికుంట తండాలో వరుస ఘటనలు దడ పుట్టిస్తున్నాయి. పూజాసామాగ్రి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, పూజలు చేసిన ఆనవాళ్లు క్షుద్రపూజలు జరుగుతున్నాయనే దానికి బలాన్నిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తున్నారు. అర్ధారాత్రి పూజలు చేసి వెళ్లిపోతున్నారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు స్థానికులు.