Selling drugs in vegetable shop : కూరగాయలతో పాటు గంజాయి కూడా అమ్ముతున్న వ్యాపారి
పైకి కూరయగాల షాపు..సైడ్ బిజినెస్ గా చక్కగా గంజాయి కూడా చక్కగా అమ్మేస్తున్నాడు ఓ కూరగాయల వ్యాపారి. మెయిన్ బిజినెస్ కూరగాయల అమ్మకమే అయినా సైడ్ బిజినెస్ గా ఏకంగా గంజాయిని అమ్మేస్తున్నాడు. అది తెలిసిన ఎక్సైజ్ అధికారులు సరదు వ్యాపారి ఆట కట్టించారు.

Vegetable Seller Arrested For Selling Drugs In Odisha
Vegetable Seller Arrested For Selling Drugs In Odisha : గంజాయి అమ్మకాలు..రవాణాల్లో కేటుగాళ్లు ఎన్ని తెలివితేటలు ఉపయోగిస్తున్నారో తెలిసిందే.మల్లెపూల్లో గంజాయిని తరలిస్తున్న ఘటనల్ని చూశాం. అటువంటి తెలివే ఉపయోగించాడు ఓ కూరగాయల వ్యాపారి. పైకి కూరయగాల షాపు..సైడ్ బిజినెస్ గా చక్కగా గంజాయి కూడా చక్కగా అమ్మేస్తున్నాడు. మెయిన్ బిజినెస్ కూరగాయల అమ్మకమే అయినా సైడ్ బిజినెస్ గా ఏకంగా గంజాయిని అమ్మేస్తున్నాడు. అలా ఆ కూరగాయల షాపునుంచి కొంతమంది గంజాయి కొంటున్న విషయం కాస్తా పోలీసుల చెవిలో పడింది. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు ఎక్సైజ్ అధికారులు
గంజామ్ జిల్లాలోని భలియాగడలో భాస్కర్ దొర అనే 40 ఏళ్ల కూరగాయల వ్యాపారి బయటకు కూరగాయ అమ్ముతూనే డ్రగ్స్ కూడా రిటైల్ దందా కూడా చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు భాస్కర్ షాపుపై తనిఖీలు చేపట్టారు. దీంతో దొరగారి గుట్టు బయటపడింది. మొత్తంలో గంజాయి, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏకే సత్పతి మాట్లాడుతూ..కూరగాయల వ్యాపారం చేస్తూ డ్రగ్స్ కూడా అమ్ముతున్నట్లుగా సమాచారం అందుకుని షాపు మీద రైడ్ చేసి 101 గ్రాముల బ్రౌన్‌షుగర్, వంద గ్రాముల ఓపియం, భారీమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని..వీటి విలువ రూ.13 లక్షలకు పైనూ ఉంటుందని తెలిపారు. డ్రగ్ పెడ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొని.. కూరగాలయల మాటున వాటిని కూడా అమ్ముతున్నాడని తెలిపారు. అతనికి ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.