Old Man: వృద్ధుడిని హతమార్చిన మరో వృద్ధుడు

ఇద్దరు వృద్ధుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో ఒక వృద్ధుడిని మరొక వృద్ధుడు గాజు ముక్కతో పొడిచి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది

Oldman

Old Man: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వృద్ధుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో ఒక వృద్ధుడిని మరొక వృద్ధుడు గాజు ముక్కతో పొడిచి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బండ్లగూడ జాగీర్ లోని సన్ సిటీ పరిధిలో ఉన్న ప్రైమ్-జెరియాట్రిక్స్ ఓల్డేజ్ హోంలో ఉంటున్న.. అయాజ్ అబ్దుల్..సాదీక్ హుస్సేన్ అనే ఇద్దరు వృద్దుల మద్య గురువారం ఘర్షణ తలెత్తింది.

Also read: Somireddy Chandramohan: అమరావతి భూముల్ని తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు

ఈక్రమంలో కోపంతో ఊగిపోయిన అయాజ్ అబ్దుల్..సాదీక్ హుస్సేన్ ను గాజుగ్లాసు ముక్కతో తీవ్రంగా పొడిచాడు. ఇది గమనించిన మిగతా వృద్ధులు.. తీవ్రంగా గాయపడిన సాదీక్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాదీక్ హుస్సేన్ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పూర్తి సమాచారం సేకరించారు. నిందితుడు అయాజ్ అబ్దుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య చిన్న పాటి వివాదమే ఈఘటనకు దారి తీసినట్లు తెలిసింది.

Also read: New Scam unearthed: JEE, GMAT ప్రవేశ పరీక్షల్లో వెలుగు చూసిన భారీ కుంభకోణం