Delhi Police : ఫేస్‌బుక్‌లో తుపాకులు సేల్స్..దందా గుట్టురట్టు
రోహిణి కోర్టు కాల్పుల కేసు దర్యాప్తులో ఢిల్లీలో తీగ లాగితే పాకిస్తాన్‌లో డొంక కదిలింది. ఫేస్‌బుక్‌లో అకౌంట్ క్రియోట్ చేసుకుంటారు.

Fb
Online Firearms : డిజిటల్ వరల్డ్ ను అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. నిన్న మొన్నటివరకు కత్తులు.. తల్వార్లు.. ప్రమాదకరమైన ఆయుధాలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో బహిరంగంగా విక్రయించడం చూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏకంగా డ్రగ్స్ అమ్మిన విషయం తెలుసుకొని సంచలనం సృష్టించాయి. ట్రెండ్ మారింది. అగ్రరాజ్యంలో ఎలాగైతే ఫేస్‌బుక్ వేదికగా తుపాకుల అమ్మకాలు జరిగాయో.. ఇండియాలో కూడా అలానే జరుగుతున్నాయట..! దాయాది దేశమైన పాకిస్తాన్ దీని వెనక ఉందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ దందా గుట్టురట్టు చేశారు పోలీసులు.
Read More : All-Party Meeting : మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్!
రోహిణి కోర్టు కాల్పుల కేసు దర్యాప్తులో ఢిల్లీలో తీగ లాగితే పాకిస్తాన్‌లో డొంక కదిలింది. ఫేస్‌బుక్‌లో అకౌంట్ క్రియోట్ చేసుకుంటారు. వేలల్లో ఫాలోవర్లను, ఫ్రెండ్స్‌ను పెంచుకుంటారు. ఆ తర్వాత నిదానంగా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవే తుపాకుల అమ్మకాలు. హాలీవుడ్ స్టైల్‌లో ఉండే.. గన్‌ల ఫోటోలను పంపిస్తారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తారు. ఏదో ఒక విధంగా యూజర్లను ఎట్రాక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక గన్‌కు ఇంతా అంటూ ధరను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌లోనే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమంటారు. ఆ తర్వాత తుపాకులను గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తారు. పోలీసులను ఎలాగో బాధితులు ఆశ్రయించ లేరు ఎందుకంటే లైసెన్స్ లేకుండా తుపాకీ కొనడం చట్టవిరుద్ధం. ఇదే విషయాన్ని క్యాష్ చేసుకున్నాడు మాస్టర్‌మైండ్ హితేష్ సింగ్. అతడు ఇప్పటికీ 11 కేసుల్లో నిందితుడని పోలీసులు తేల్చారు.
Read More : Bigg Boss 5: జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ ఎలిమినేషన్.. స్క్రిప్ట్ ప్రకారమే చేశారా?
చాలా సార్లు జైలు జీవితం గడిపిన అతడిపై రాజస్థాన్‌లోని పలు పోలీసు స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి. ఫేస్‌బుక్ వేదికగా హితేష్ చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. అతని అకౌంట్‌లో ఏకంగా 5వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అతను ఆయుధాలను ఏకంగా గ్యాంగ్‌స్టర్స్ కూడా అమ్మినట్లు సమాచారం. అంతేకాదు కరుడుకట్టిన క్రిమినల్స్ కు కూడా హితేష్ ద్వారా ఆయుధాలు సప్లై అయినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో ఎవరికైనా ప్రాణ హాని ఉంటే గన్ లైసెన్స్ తీసుకుని పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుని మాత్రమే తుపాకీ దగ్గర పెట్టుకోవాలి. బయట ఎక్కడ పడితే అక్కడ తుపాకులు కొనుక్కోవడం కుదరదు. అలా ఎవరైనా అమ్మినా, కొన్నా అది చట్ట విరుద్ధం. కానీ హితేష్ మాత్రం పోలీసులు కళ్లుగప్పి ఫేస్‌బుక్‌లో తుపాకులను అమ్మాడు. దీనికి పాకిస్తాన్‌లోని తుపాకులు అమ్మే ముఠా అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హితేష్ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌లిస్ట్ లో చాలా మంది పాకిస్తాన్ దేశస్థులు కూడా ఉండడం పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.