Tasty Teja : యూట్యూబర్ టేస్టీ తేజ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసుల విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసు విచారణలో భాగంగా టేస్టీ తేజ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో తేజను పోలీసులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో అతడికున్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడనే వివరాలు రాబట్టారు పోలీసులు. కాగా, మీడియా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రాలేదు టేస్టీ తేజ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తనకు ఎలాంటి నోటీసులు రాలేదు అంటూనే పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు తేజ.
కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. 11 మంది యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయన్సర్లపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ కు ఎవరెవరు ప్రమోషన్ చేశారని పోలీసులు కూపీ లాగుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Also Read : స్నేహం పేరుతో దగ్గరై డ్రగ్స్ అలవాటు చేసి బాలికలపై అఘాయిత్యాలు- వరంగల్ కిలాడీ లేడీ కేసులో సంచలనం
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఎన్ని వీడియోలు పెట్టారు? ఎప్పుడెప్పుడు పెట్టారు? ఆ బెట్టింగ్ యాప్స్ కి వీళ్లకు ఏం సంబంధం? ఏమైనా డబ్బులు సంపాదించారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుగుతోంది. ప్రస్తుతం దర్యాఫ్తు ప్రాథమిక స్టేజ్ లో ఉంది. దర్యాఫ్తు అధికారులు ఆధారాలు కలెక్ట్
చేస్తున్నారు.
”ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి అనేదానిపై దర్యాఫ్తు అధికారులు నిర్ణయం తీసుకుంటారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్ కి, ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్ననాటి స్నేహితుడు అని తెలుస్తోంది. చాలా వీడియోల్లో వారిద్దరూ కలిపి కనిపించారు.
ఇమ్రాన్ తో కలిసి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై ఫిర్యాదు అందింది. దానిపై ఎవిడెన్స్ సేకరిస్తాం. అందులో నిజం అని తేలితే కానిస్టేబుల్ కిరణ్ పైనా చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నడిపించడం, వాటిలో పాల్గొనడం, ఆ యాప్ లను ప్రోత్సహించడం ప్రమోషన్ చేయడం అన్నీ చట్టవిరుద్ధం” అని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్
అన్నారు.