విశ్లేషణ: రేప్‌లకు కారణమేంటి?పురుషాధిక్యమా? లేదంటే న్యాయం ఆలస్యంకావడమా?మరి పోలీసింగ్ మాటేంటి?

ముగ్గురు కలిసి ఓ మహిళను రేప్ చేశారు. ఆమె బిడ్డను పావ్‌మెంట్‌లోకి విసిరేశారు. మరో ముగ్గురు ఎనిమిది గంటల పాటు వెహికల్ లోనే మహిళను రేప్ చేశారు. మరో చోట లవర్ ను అని నమ్మించి అతని స్నేహితుడితో కలిసి రేప్ చేయడమే కాక చంపేశాడు. పక్కింటి వ్యక్తి అత్యాచారం చేసి జీవితాన్ని చిదిమేయడమే కాకుండా నిప్పంటించి తగులబెట్టేశాడు.
అసలు నిజానికి సాధారణమైన మనుషులైన వీరు ఇంతా కిరాతకంగా హంతకులుగా ఎలా మారతారు.
సైకాలజిస్టులు, లాయర్లు, పోలీసులు రేప్ జరిగిన విధానం గురించి చేసిన వ్యక్తుల గురించి ఆరా తీయడానికి తలమునకలవుతుంటారు. ప్రత్యేకించి ఢిల్లీ ఆ పక్క ప్రాంతాల్లో..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. ఢిల్లీలో ప్రతి రోజు ఓ ఆరుగురు రేప్ కు గురువుతూనే ఉంటారు. 2015లో జరిగిన రేప్ లలో 95శాతం బాధితురాలికి తెలిసిన వ్యక్తులే చేశారు. ఫిబ్రవరిలో చెన్నైకు చెందిన ఏడేళ్ల బాలికను ఇంటి పక్క వ్యక్తి రేప్ చేసి, కాల్చి, చంపేశాడు.
కొద్దివారాలుగా మానేసర్ లోనూ 19ఏళ్ల యువతి వాన్ లో రేప్ కు గురికావడంతో పాటు ఆమె కన్నబిడ్డ అయిన 9నెలల పసికందును కూడా చంపేశారు. సోనెపేటలో మాజీ లవర్ రేప్ చేసి చంపేశాడు. గురుగావ్ లో మహిళను పికప్ చేసుకుని కదులుతున్న వాహనంలో ఎనిమిది గంటల పాటు రేప్ చేసి చంపేశారు. రేపిస్ట్, ఊహించని రీతిలో వయోలెన్స్ సృష్టించాడు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లీడ్ సైన్సెస్ డైరక్టర్ నిమేశ్ దేశాయ్.. ఇటువంటి క్రిమినల్ బిహేవియర్ మగాధిపత్యం ఉండాలనే ఫీలింగ్ నుంచే పుట్టుకొస్తుందని అంటున్నారు. మగాళ్లదే పై చేయి అని నిరూపించుకోవాలనే అంతర్గత ఒత్తిడి పెంచేసుకుని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు.
నెగెటివ్ మెంటాలిటీ, ఆలోచనలు పెంచేసుకుని గ్రూపుల్లో గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున్నారు. ”యాంటీ సోషల్, క్రిమినల్ బిహేవియర్ అనేవి గ్రూపుల్లో ఏర్పడతాయి. గ్రూప్స్ లో ఉండి నిర్ణయం తీసుకునేసరికి కంఫర్ట్ తో పాటు ధైర్యం వచ్చేస్తాయి. అతి నమ్మకం వల్ల తప్పుడు ప్రవర్తనలు దారి తీయడం జరుగుతుంటాయి. ఫలితంగా జడ్జ్‌మెంట్‌లో మాత్రం కాంప్రమైజ్ కావాలసిందే.
సైకాలజీ ఆఫ్ ద రేపిస్ట్ అనే థియరీపై హెచ్చరికలు జారీ చేసి సీనియర్ సైక్రియాట్రిస్ట్.. నిర్వచించలేనట్లుగా నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. రేపిస్ట్ ల సైకాలజీల గురించి వివరించాలంటే ఇంటెన్షన్లనేవి మంచిగానే ఉంటాయి కానీ పబ్లిక్ ఆలోచనలతో జస్టిఫై చేయాలనుకుంటే మాత్రం విరుద్ధంగా కనిపిస్తాయి. ఇతర విషయాల్లోనూ వారిని విలన్లలాగే చూస్తారు.
2015లో దేశంలో రేప్ లు 34వేల 651 ఉంటే ఢిల్లీలో మాత్రమే 2వేల 199గా ఉన్నాయి. రేపిస్టులకు ఆ చిన్నారిని చంపాల్సిన పనేంటి, గంటల కొద్దీ రేప్ చేసి మహిళల శరీరాలను హింసించాలనే ఆలోచనలకు మూలం ఎక్కడిదనేది అసలు చర్చ.
కొన్ని సార్లు రేపిస్టుల పనులకు కారణంగా ఆల్కహాల్ ప్రభావం కావొచ్చు, మరికొందరు ప్రతీకారేచ్చతో ఆవేశపూరితంగా చేయొచ్చు. అటువంటి నేరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ చాలా పెద్ద విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.
పురుష ఆధిక్య సమాజంలో ఉంటున్న మనం.. మహిళ స్వేచ్ఛగా ఉంటే కంఫర్టబుల్ గా ఫీల్ అవలేం’ అని సుప్రీం కోర్టు లాయ్ శిల్పి జైన్ అంటున్నారు. ‘మగాడు ఓ ఇండిపెండెంట్ మహిళను చూడగానే వాడి ఈగో హర్ట్ అయిపోతుంది. అందుకే వారి పవర్ కంటే ఎక్కువ ఆధిక్యం చూపించాలనుకుంటారు. నువ్వు నా కంట్రోల్ లో ఉన్నావ్ అనిపించుకోవాలని ఆరాటం. నిజానికి మహిళలు ఇండిపెండెంట్ గా బతకగలరు. కానీ, మగాడు తలచుకుంటే వారిని కంట్రోల్ చేయగలడు’ అని డిఫెన్స్ లాయర్ అంటున్నారు. .
ముంబైకు చెందిన సైకాలజిస్ట్ హరీష్ శెట్టి నేర నిరూపణలు ఇందుకే ఆలస్యం అవుతుందంటున్నారు. ‘అది రేప్ అని విన్న తర్వాత నిందితుడు ఎవరో ఒక నెలలో తెలిసిపోతుంది. కానీ, శిక్ష పడటానికి 20సంవత్సరాలు పడుతుంది. చట్టం గురించి అవగాహన లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణమే. ఆరోపణలు ఎక్కువ నిరూపణలు తక్కువగా ఉన్నాయి.
ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం.. దోషుల శాతం 21.7శాతంగానే ఉంది. దీనిని బట్టి తెలుస్తుందేమంటే 10మంది నిందితుల్లో ఏడుగురు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. 2012 డిసెంబరు 16న ఫిజియోథెరఫీ ఇంటర్నె స్టూడెంట్ ను ఓ గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు హత్యకు పాల్పడ్డారు. జాతీయవ్యాప్తంగా ఈ ఉదంతం గురించి వెలుగు చూసిన తర్వాత వారికి 9నెలల్లోనే శిక్ష మంజూరు అయింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి.
లక్నోలో ఉండే 13ఏళ్ల బాలికను 2005లో గ్యాంగ్ రేప్ చేశారు. వారికి శిక్ష పడేందుకు 11ఏళ్ల సమయం పట్టింది. 2003లో ఇద్దరు ప్రెసిడెన్షియల్ గార్డ్స్ ఓ మైనర్ ను రేపచేయగా అది కేవలం ట్రయల్ కోర్టు వద్దకు మాత్రమే రాగలిగింది. జైన్ ఉద్దేశ్యం ప్రకారం.. ఈ కేసుల్లో సాక్ష్యాలనేవి తారుమారు అవడం, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వీటికి కారణం కావొచ్చని. కోర్టులో కేసు వేస్తే న్యాయం జరిగేంత వరకూ పోరాడేల్సిందేనని అంటున్నారు.
ముంబై మాజీ పోలీస్ జాయింట్ కమిషనర్(క్రైమ్) ఎమ్ఎన్ సింగ్.. సిస్టమ్ లోనే మార్పు రావాలని… ఇలా చేస్తే ఎంత ప్రమాదకరమైన శిక్షలు ఉంటాయనేది దృష్టిలో ఉండాలని అంటున్నారు. జేవర్ బులందర్‌షార్ హైవే వద్ద మే నెలలో గ్యాంగ్ రేప్ జరిగిందంటే అక్కడ పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని సూచించారు. ‘సోషల్ కంట్రోలింగ్ అనేది లోపిస్తే చట్టాన్ని మాత్రమే అమలుచేస్తే ఆ ప్రభావం ఎంతో ఉండదని’ సింగ్ అంటున్నారు.