ప్రాణం తీసిన పేకాట, పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 01:38 PM IST
ప్రాణం తీసిన పేకాట, పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య

Updated On : October 3, 2020 / 2:55 PM IST

playing cards takes life: జగిత్యాల జిల్లాలో పేకాట ఓ యువకుడి ప్రాణం తీసింది. పోలీసు కేసు భయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిన్న(అక్టోబర్ 2,2020) మల్యాల మండలం తక్కలపల్లిలో పేకాట ఆడుతూ ముగ్గురు యువకులు పట్టుబడ్డారు.




పదివేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కిరణ్ అనే యువకుడు రాత్రి పొలంలో ఉరివేసుకుని చనిపోయాడు. పోలీసులు తప్పుడు కేసు పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కిరణ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.