ప్లస్ టూ చదివే విద్యార్ధిని దారుణ హత్య

ప్లస్ టూ చదివే విద్యార్ధిని దారుణ హత్య

Updated On : February 20, 2021 / 5:38 PM IST

Plus two student killed by releative in idukki CCTV footage : కేరళ లోని పల్లివాసల్ వద్ద ప్లస్ టూ చదివే విద్యార్ధిని రేష్మా దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగుడు ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ అయిపోయినా ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రేష్మ బైసన్ వ్యాలీ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్లస్ టూ చదువుతోంది, పల్లివాసల్ పవర్ హౌస్ ప్రాంతంలో ఆమె తన కజిన్ అను తోవెళుతున్నట్లు కొందరు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజి పరిశలించగా రేష్మా అతని కజిన్ అనుతో వెళుతున్నట్లు గుర్తించారు.

రేష్మకు, అనుకు గతంలో గొడవలు జరిగినట్లు గుర్తించారు. రేష్మ మృతదేహం లభించిన పవర్ హౌస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అను మొబైల్ ఫోన్ దోరకటంతో,  తప్పించుకు తిరుగుతున్న అను కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాత కక్షల నేపధ్యంలోనే అను, రేష్మను హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.